Wed Dec 25 2024 06:22:03 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 25 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికపరంగా జాగ్రత్తలు అవసరం. ఎదుటివారు 100 మాట్లాడితే ఒక్కమాటతో..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, శనివారం
తిథి : శు.షష్ఠి రా.12.20 వరకు
నక్షత్రం : భరణి తె.3.59 వరకు
వర్జ్యం : మ.1.15 నుండి 2.54 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.32 నుండి 8.05 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అవకాశాలు కలసివస్తాయి. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి. రాకపోకలు సానుకూలంగా సాగుతాయి. పెట్టుబడులు కలసివస్తాయి. ఎదుటివారితో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. నమ్మకద్రోహం జరగవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అపోహలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కీడెంచి మేలెంచాలన్న చందంగా ఆలోచించడంతో పనులు నిదానంగా సాగుతాయి. ఆచితూచి మాట్లాడాలి. పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. అప్పుల బాధ నుండి బయటపడతారు. శుభకార్యాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శత్రుబలం పెరుగుతుంది. తప్పుదోవ పట్టించేవారు పెరుగుతారు. ఖర్చులకు సరిపడా ఆదాయం ఉంటుంది. రిజిస్ట్రేషన్లలో మంచి ఫలితాలుంటాయి. కొత్త కోర్సులు నేర్చుకునేవారికి శుభకాలం. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గురుబలం తక్కువగా ఉండటంతో మోసపోయే అవకాశాలు ఎక్కువ. అప్పులు ఇవ్వడం, తీసుకోవడానికి ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. షూరిటీలకు దూరంగా ఉండాలి. నూతన పెట్టుబడుల ప్రయత్నాలు నామమాత్రంగా ఉంటాయి. ఉద్యోగమార్పు అనుకూలం కాదు. రహస్యాలను ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. అపార్థాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ కి దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికపరంగా జాగ్రత్తలు అవసరం. ఎదుటివారు 100 మాట్లాడితే ఒక్కమాటతో సమాధానం చెప్పేలా ఉండాలి. గౌరవ, మర్యాదలకు లోటుండదు. భవిష్యత్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎంతపెద్ద కష్టాన్నైనా చిన్న లాజిక్ తో బయటపడతారు. కొండల్లా వచ్చిన కష్టాలు మబ్బుల్లా వెళ్లిపోతాయి. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. పాత పరిచయాలు బలపడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల, వ్యతిరేక ఫలితాలు సమానంగా ఉంటాయి. మీ నుంచి సహాయం పొందేవారు తప్ప.. సహాయ పడేవారుండరు. ప్రతి పనిని స్వయంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా జాగ్రత్తలు అవసరం. మంచికి పోయి చెడుని తెచ్చుకున్నట్లు ఉంటుంది. ఆర్థికంగా అనూహ్య ఖర్చులుంటాయి. అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒడిదుడుకులను తట్టుకుని ముందుకెళ్తారు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక, ఆరోగ్యాల విషయంలో మెరుగైన ఫలితాలుంటాయి. సంఘ గౌరవం పెరుగుతుంది. వివాహాది శుభకార్యాల అంశాలు సానుకూలంగా సాగుతున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. స్థలాల క్రయవిక్రయాల్లో అనుభవజ్ఞుల సలహాలు పాటించాలి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story