Mon Dec 23 2024 02:24:40 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : ఫిబ్రవరి 26 నుండి మార్చి 4 వరకు వారఫలాలు, పరిహారాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూల ఫలితాలుంటాయి. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, ఆదివారం
తిథి : శు.సప్తమి రా.12.58 వరకు
నక్షత్రం : కృత్తిక రా.5.19 వరకు
వర్జ్యం : సా.4.30 నుండి 6.20 వరకు
దుర్ముహూర్తం : సా.4.37 నుండి 5.23 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.45 నుండి 9.40 వరకు
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
వృషభం - కుజుడు
వృశ్చికం - కేతువు
మకరం,కుంభం - బుధుడు
కుంభం - రవి, శని
మీనం -గురువు, శుక్రుడు
చంద్రగ్రహ సంచారం
మేషం, వృషభం, మిథునం, కర్కాటకం
ఫిబ్రవరి 26 నుండి మార్చి 4 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం టెన్షన్ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి అధికమవుతుంది. కష్టాలు, నష్టాలు ఉండవు. సంఘం గౌరవం ఉంటుంది. పేరు, ప్రఖ్యాతులు కలుగుతాయి. క్షణం తీరిక లేకుండా కాలక్షేపం చేస్తారు. నిద్రాహారాలు మాత్రం లోపిస్తాయి. శుభకార్యాలు ముందుకు సాగుతాయి. ఈ వారం ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. చాలా కాలం తర్వాత విశ్రాంతి లభిస్తుంది. తొందరపాటు తనానికి దూరంగా ఉంటారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రేమలు ఫలిస్తాయి. రెండో పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగుతున్నాయి. వాహనయోగం ఉంటుంది. సంతానం విషయంలో చింత ఏర్పడుతుంది. ఈ వారం సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అధిక జాగ్రత్తలు పాటించాలి. నూతన పనులను ప్రారంభించకపోవడం మంచిది. శుభకార్యాలకు ఆటంకాలు ఉండవు. దృష్టి దోషం అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు ఇబ్బందికరంగా ఉన్నా అధిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రిజిస్ట్రేషన్లు వాయిదా పడొచ్చు. ఈ వారం ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పఠించి, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూల ఫలితాలుంటాయి. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొత్త సమాచారాన్ని తెలుసుకుంటారు. క్షణం తీరికలేకుండా గడుపుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటపుడు చాకచక్యంగా వ్యవహరిస్తారు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. ఈ వారం ఆది, సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సూర్యభగవానుడికి అర్ఘ్య ప్రదానం చేసి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడానికి ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ఏ పనైనా రహస్యంగా ఉంచుకోవాలి. రహస్యంగా చేసే పనులు పూర్తవుతాయి. సంతకాలకు విలువైన ఉద్యోగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. దంపతుల మధ్య తరచూ గొడవలు రావొచ్చు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఈ వారం సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి కొత్త అవకాశాలు కలసివస్తాయి. వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. విదేశీయాన ప్రయత్నాలకు అవాంతరాలు తొలగిపోతాయి. సహోద్యోగులతో విభేదాలు తొలగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, ఆర్థిక పరమైన విషయాల్లో అధిక జాగ్రత్త అవసరం. బంధువులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఎవరూ అర్థం చేసుకోవట్లేదని బాధపడతారు. ఆర్థికంగా విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఏదో ఒకటి సాధించాలని చేసుకున్న ప్రణాళికలు ఫలించవు. వీలైనంత వరకూ ఎదుటివారితో పోల్చుకోకపోవడం మంచిది. ఈ వారం ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. విశ్రాంతి తక్కువగా, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరంగా ఇబ్బందులుంటాయి. ఉద్యోగపరంగా అనుకున్న ఫలితాలుంటాయి. మార్కెటింగ్ రంగంవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి ఫలితాలుంటాయి. స్థలాన్ని లీజుకిచ్చే నిర్ణయాలు ఫలిస్తాయి. ఈ వారం ఆది, సోమ వారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదుగుదలకు ఉపయోగించే అవకాశాలు పెరుగుతాయి. డబ్బులిచ్చైనా వాళ్లని వదిలించేసుకోవాలన్న ఆలోచనలు బలపడతాయి. ప్రతి దానిలో క్లియర్ గా ఆలోచిస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ వారం సోమ, బుధ, గురువారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. అన్నివిషయాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. మీ స్వార్థం గురించే ఆలోచిస్తారు. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. విహారయాత్రలు, వినోద కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. మీ ఆనందానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం చిన్నపాటి తప్పులు చేసినా సరిచేసుకునే మార్గాలు లభిస్తాయి. ఆశించిన మేర రుణాలు లభిస్తాయి. రొటేషన్లకు ఇబ్బందులుండవు. శుభకార్యాల అంశాలు సానుకూలంగా సాగుతాయి. విసుగుకి చోటివ్వరాదు. ఈ వారం ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ధైర్యే, సాహసే లక్ష్మి అన్నట్టుగా పనులు కొనసాగుతుంటాయి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించదు. దృష్టిదోషం పెరుగుతుంది. రహస్య శత్రువులతో ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగం మానలేరు, చేయలేక ఒత్తిడికి గురవుతారు. ఈ వారం సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story