Wed Dec 25 2024 07:00:16 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 28 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముఖ్యమైన పనుల్లో విజయం పొందుతారు. ఎదుటివారిని అంచనా ..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, మంగళవారం
తిథి : శు.నవమి తె.4.18 వరకు
నక్షత్రం : రోహిణి ఉ.7.20 వరకు
వర్జ్యం : మ.1.31 నుండి 3.17 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.50 నుండి 9.37 వరకు, రా.11.06 నుండి 11.55 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.50 నుండి 1.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరగవచ్చు. ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ బిల్స్ రాక ఇబ్బందిపడతారు. మంచి ఆహారాన్ని స్వీకరిస్తారు. జీవిత భాగస్వామితో జరిపే చర్చలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అధికంగా పాటించాలి. కష్టనష్టాలుండవు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలుంటాయి. వ్యవసాయరంగంలో వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఫైనాన్స్ విషయాలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. దృష్టిదోషం పెరుగుతుంది. అనవసరమైన వివాదాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగపరంగా ఉన్న ఒత్తిడులను తట్టుకుని నిలబడతారు. కాంట్రాక్ట్ రంగంలోవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు స్థిర చరాస్థులపై దృష్టిసారిస్తారు. వృథా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. తగాదా పడితే తప్ప పూర్తికాని పనులపై దృష్టి సారిస్తే విజయం పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. చిన్నపాటి తగాదాలతో మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఎదుటివారిని అంచనా వేయగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. రహస్యాలను మెయింటెన్ చేస్తారు. కోరినవారికి సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కీలక నిర్ణయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. తప్పనిసరి పనులపై మాత్రమే దృష్టిసారిస్తారు. కీలకమైన పనులను వాయిదా వేయడం మంచిది. శత్రుబలం పెరుగుతుంది. కీడెంచి మేలెంచాలన్న చందంగా ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముఖ్యమైన పనుల్లో విజయం పొందుతారు. ఎదుటివారిని అంచనా వేయగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. నిద్ర సరిగా లేక ఇబ్బంది పడతారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలసివస్తుంది. అడిగినవారికి లేదనకుండా సహాయం చేస్తారు. చిన్న విషయాలను బూతద్దంలో చూడకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా ఆలోచిస్తారు. మీ సహాయం పొందేవారు తప్ప మీకు సహాయపడేవారు కనిపించరు. ప్రతి పనిలోనూ పెద్దవారి సలహాలు తీసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గోల్డ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. రుణప్రయత్నాలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. చికాకులుంటాయి. ఎదుటివారు అర్థం చేసుకోక బాధపడతారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలమైన ఫలితాలుంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. క్రయవిక్రయాలు కలసివస్తాయి. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. చర్చలు ఫలిస్తాయి. అపోహలు తొలగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
Next Story