Thu Dec 26 2024 06:33:12 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 3 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. కావాలనే పనులను వాయిదా వేస్తారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్రవారం
తిథి : శు.త్రయోదశి సా.6.57 వరకు
నక్షత్రం : పునర్వసు పూర్తిగా..
వర్జ్యం : రా.7.47 నుండి 9.35 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.57 నుండి 9.43 వరకు, మ.12.44 నుండి 1.29 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.2.10 నుండి 2.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కోర్టు సంబంధిత అంశాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వైద్య సంప్రదింపులు కలసివస్తాయి. వ్యాపారస్తులకు పెట్టుబడుల ప్రయత్నాలు కలసివస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు విస్తారంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ సహాయం పొందేవారే తప్ప.. మీకు సహాయపడేవారు తక్కువగా ఉంటాయి. విలువైన వస్తువులు కనిపించక కంగారు పడతారు. వ్యాపారస్తులు కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపయోగకరమైన ఖర్చులుంటాయి. ఒప్పంద పత్రాలను అందుకుంటారు. పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అజీర్తి, ఒళ్లునొప్పుల సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అధికంగా ఉన్నా.. వాటిని అధిగమిస్తారు. వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూల ఫలితాలుంటాయి. శత్రువులను అంచనా వేయడంలో విఫలమవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ఉన్నతి వచ్చే అవకాశాలున్నాయి. ఆర్థిక సర్దుబాట్లకు అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య తగాదాల పరిష్కార ప్రయత్నాలు ఫలిస్తాయి. తెలివితేటలతో రాణిస్తారు. వైద్య సంప్రదింపులు తప్పకపోవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. క్రీడా రంగంవారికి మంచి ఫలితాలుంటాయి. రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. చిన్న ఒత్తిడులున్నా అధిగమిస్తారు. మొండితనాన్ని వదిలేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. కావాలనే పనులను వాయిదా వేస్తారు. ఆర్థికపరంగా ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అంచనాలు తారుమారవుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శారీరక అలసట అధికమవుతుంది. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని గుడ్డిగా నమ్మడం వల్ల ఇబ్బందులు తప్పవు. ఊహాగానాలకు ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలను ఎదుటివారు సమర్థిస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. శుభకార్యాలు అనుకూలంగా జరుగుతాయి. విదేశీయాన ప్రయత్నాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయ విక్రయాల అంశాలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుటివారిని అంచనా వేయగలుగుతారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు మెరున్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వివాదాలు దరికి రావొచ్చు. సంతకానికి విలువ కలిగిన ఉద్యోగాలు చేసేవారు జాగృతతో మెలగాలి. రోజంతా చికాకుగా సాగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. వాహన మరమ్మతులు తప్పకపోవచ్చు. ప్రేమకు ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. వ్యసనాల వల్ల అగౌరవం కలుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
Next Story