Thu Dec 26 2024 05:59:56 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 4 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా సహకరిస్తుంది. శుభవార్తలు వింటారు. వేళకు తగిన నిద్రాహారాలు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, శనివారం
తిథి : శు.చతుర్థశి రా.9.29 వరకు
నక్షత్రం : పునర్వసు ఉ.9.16 వరకు
వర్జ్యం : సా.6.15 నుండి 8.03 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.43 నుండి 8.12 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : సా.6.05 నుండి 6.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వాహన మరమ్మతులు చోటుచేసుకుంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగ, వ్యాపారులకు సాధారణ ఫలితాలుంటాయి. విద్యార్థులు చదువుపై అధికశ్రద్ధ కనబరచాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల వాతావరణం ఉంటుంది. పనిని పూర్తయ్యేంతవరకూ విడవరు. పరిచయాలు విస్తరిస్తాయి. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. ఇంటి సంబంధిత పనులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు విస్తారంగా పెరుగుతాయి. అపనిందలు పడొచ్చు. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం కాదు. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చర్చలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు కలసివస్తాయి. మనసుకు నచ్చినట్టు వ్యవహరిస్తారు. ఇష్టంలేని విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతారు. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానంగా ఉండాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దృష్టిదోషం, శత్రుబలం పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏ పని చేసినా కలిసివస్తుంది. నిదానమే ప్రధానంగా ముందుకి సాగుతారు. పెద్దల సహాయ, సహకారాలు లభిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా సహకరిస్తుంది. శుభవార్తలు వింటారు. వేళకు తగిన నిద్రాహారాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు ఊరటనిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గడిచి రెండ్రోజులకంటే మెరుగ్గా ఉంటుంది. ఆశించిన స్థాయిలో పనులు జరగకపోవడంతో నిరుత్సాహ పడతారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎదుటి వారు ఏం చెప్పినా పట్టించుకోరు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బద్ధకం పెరుగుతుంది. ప్రయాణాలకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభకార్యాలు ముందుకి సాగుతాయి. ప్రేమలు ఫలిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారస్తులకు మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. ఎదుటివారి సహాయ సహకారాలు అందుతాయి. బ్యాంకింగ్ సెక్టార్, ఫైనాన్స్ రంగాల వారికి ఊరట కలుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. క్రయవిక్రయాల్లో తొందరపాటు తగదు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదం చోటుచేసుకుంటుంది. తప్పనిసరి పనులపై మాత్రమే దృష్టి సారించాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story