Mon Dec 23 2024 02:14:54 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 11 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం 8వ తేదీ తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఖర్చులకు డబ్బులులేకపోయినా..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, ఆదివారం
తిథి : మాఘ పూర్ణిమ రా.11.58 వరకు
నక్షత్రం : పుష్యమి మ.12.13 వరకు
వర్జ్యం : తె.2.32 నుండి 4.19 వరకు
దుర్ముహూర్తం : సా.4.19 నుండి 5.17 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.9.00 నుండి 9.40 వరకు, సా.7.00 నుండి 7.50 వరకు
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
వృషభం - కుజుడు
తుల - కేతువు
ధనస్సు, మకరం - బుధుడు
మకరం - రవి
కుంభం - శుక్రుడు, శని
మీనం -గురువు
చంద్రగ్రహ సంచారం
కర్కాటకం, సింహం, కన్య
ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 11 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రతి విషయాన్ని నేర్పుగా చేసుకుంటారు. ప్రతి పనిలో ఆలోచన దృఢత్వం ఉంటుంది. వ్యాపారస్తులకు ఒత్తిడులు ఉంటాయి. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. నలుగురిలోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడతారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక్క మూసపద్ధతి అలవాటై పోయి.. పదిమంది సంతోషాన్ని మీ సంతోషంగా మార్చుకుంటారు. వైద్యుల సలహాలను యథావిధిగా పాటించాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం ఆదివారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసి, దుర్గా అమ్మవారిని పూజించాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం విచిత్రమైన గ్రహస్థితి ఉంటుంది. అంచనాలు తారుమారవుతాయి. పూర్తవుతాయి అనుకున్న పనులు వాయిదా పడుతూ.. పూర్తికాదనుకున్న పని అనూహ్యంగా పూర్తవుతుంది. భవిష్యత్ పై ఆశ పెరుగుతుంది. అప్పులు ఇవ్వనంతవరకూ, తీసుకోనంత వరకూ ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ఎదుటివారి ఆలోచనలను అంచనా వేయగలుగుతారు. గౌరవ, మర్యాదలకు లోటు ఉండదు. బాధ్యతలు బరువుగా పరిణమిస్తాయి. ఈ వారం మంగళ, బుధ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం శుభకార్యాలు యథావిధిగా పూర్తవుతాయి. ఎదుటివారితో జరిపే చర్చలు ఫలప్రదమవుతాయి. ఉద్యోగ మార్పులకు అనుకూలమైన కాలం కాదు. విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు అందివస్తాయి. పెద్ద వ్యాపారస్తులు, నూతన పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి వ్యవహరించాలి. వివాదాలు తప్పకపోవచ్చు. సమయానికి అనుకున్నంత ధనం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వారం ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం 8వ తేదీ తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఖర్చులకు డబ్బులులేకపోయినా.. సమయానికి డబ్బు అందుతుంది. ఖర్చుల నియంత్రణ ఉండదు. స్వయంకృతాపరాధం ఉండనంతవరకూ పెద్దగా ఇబ్బందులు ఉండవు. మధ్య వర్తిత్వం, షూరిటీ సంతకాలు వాటికి దూరంగా ఉండటం మంచిది. ఈ వారం మంగళ వారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ సంబంధిత అంశాల్లో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాల్లో విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఏ మాట మాట్లాడిన తోటివారు హేళన చేసే అవకాశాలున్నాయి. మౌనేన కలహం నాస్తి అన్నట్టుగా ఉండటం మంచిది. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ వారం ఆది, శుక్ర, శనివారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అష్టమంలో కుజుడు దోషప్రధాతగా ఉన్నా.. పెద్దగా ఇబ్బందులుండవు. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చైపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్తారు. పుస్తక పఠనంపై ఆసక్తిగా ఉంటారు. ఈ వారమంతా విలక్షణంగా, విశేషంగా ఉంటుంది. కానీ దంపతులు కలిసి ఉండేందుకు సమయం ఉండదు. వీలైనంతవరకూ బయటిఫుడ్ కు దూరంగా ఉండటం మంచిది. ఈ వారం ఆది,సోమ, మంగళ,బుధ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గాస్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. పెద్దమొత్తాల్లో పెట్టుబడులకు అనుకూలం కాదు. తల్లిదండ్రుల ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉండేందుకు సమయం తక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో ఖచ్చితంగా తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్ని సార్లు కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితి విచిత్రంగా ఉంటుంది. ఎంతవరకూ డబ్బు అవసరమో.. అంతవరకే లభిస్తుంది. పొదుపు చేసేందుకు డబ్బు నిలవదు. విపరీతమైన ఆలోచనలతో నిద్రలోపిస్తుంది. అనవసరమైన చికాకులు పెరుగుతాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఎలాంటి పొరపాట్లు జరిగినా.. అంత్యవిజయం మీదే అవుతుంది. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. క్షణం తీరిక లేదు.. పైసా ఆదాయం లేదన్నట్టుగా సాగుతుంది. శారీరకంగా, మానసికంగా అలసట పెరుగుతుంది. తగ్గిపోయిన అనారోగ్య సమస్యలు మళ్లీ ఇబ్బంది పెడతాయి. ఒంటరిగా ఉన్నామన్న భావజాలం పెరుగుతుంది. ఆర్థిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ వారం ఆదివారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య పరంగా ఇబ్బందులు పెరుగుతాయి. వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి. సహకరించేవారు దరిచేరరు. బాధ్యతలు పెరుగుతాయి. రావలసిన డబ్బు రాక, కట్టాల్సిన డబ్బు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉండటంతో ఇబ్బంది పడతారు. శత్రువులెవరో, మిత్రులెవరో తెలుసుకుంటారు. క్రయవిక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని యధాశక్తిగా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. స్థిర, చరాస్తులను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. ప్రతి పనిని పూర్తిచేసేంతవరకూ విడిచిపెట్టరు. శుభవార్తలు వింటారు. వేళకు సరైన నిద్రాహాలతో ఆరోగ్యంగా ఉంటారు. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story