Thu Dec 26 2024 05:35:45 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 6 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన అంశాలు, కొనుగోళ్లు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, సోమవారం
తిథి : బ.పాడ్యమి తె.2.18 వరకు
నక్షత్రం : ఆశ్లేష మ.3.03 వరకు
వర్జ్యం : తె.4.24 నుండి 6.11 వరకు
దుర్ముహూర్తం : మ.12.44 నుండి 1.30 వరకు, మ.3.01 నుండి 3.46 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.15 నుండి 9.50 వరకు, సా.3.55 నుండి 4.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రుణప్రయత్నాలు తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. క్రయ విక్రయాల విషయాల్ని వాయిదా వేసుకోవడం మంచిది. మనసుకి దగ్గరగా ఉన్నవారితోనే తగాదాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన అంశాలు, కొనుగోళ్లు, చర్చలను మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తిచేసుకోవడం మంచిది. పనులు వాయిదా పడుతుంటాయి. నిరుద్యోగులు గట్టి ప్రయత్నాలు చేయాలి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎదురవుతాయి. మాట పట్టింపులు ఏర్పడుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి మధ్యాహ్నం తర్వాతి కాలం సహకరిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. వృథా ఖర్చులుంటాయి. పనులను వాయిదా వేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడితో ఉంటుంది. ప్రతిపనినీ దగ్గరుండి చూసుకోవాలి. ఆర్థిక పరమైన చర్చలను మధ్యాహ్నం లోగా పూర్తిచేసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకూ అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. హఠాత్తుగా పరిణామాలు మారుతాయి. పనులు వాయిదా పడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా సహకరిస్తుంది. ఉద్యోగపరంగా తీసుకునే ప్రతి నిర్ణయం కలసివస్తుంది. క్రయవిక్రయాలు లాభసాటిగా కొనసాగుతాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సహాయం చేస్తారనుకున్నవారు మొండి చేయి చూపిస్తారు. ఆర్థికపరమైన అంశాలు నిరాశపరుస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రుణప్రయత్నాలు తప్పకపోవచ్చు. భార్యభర్తల మధ్య తగాదాలు, విభేదాలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. చర్చలు ఫలిస్తాయి. ప్రేమలు సక్సెస్ అవుతాయి. ఎదుటివారి నుండి బహుమతులు అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన సర్దుబాట్లకు అనుకూలమైన కాలం. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కావలసిన పనివిషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం వరకూ తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆత్మీయులతో ఎంత తక్కువగా మాట్లాడితే అంతమంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story