Thu Dec 26 2024 05:55:58 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 8 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అంచనాలు తారుమారవుతాయి. ప్రణాళికలు తలకిందులవుతాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, బుధవారం
తిథి : బ.తదియ తె.6.23 వరకు
నక్షత్రం : పూర్వఫాల్గుణి రా.8.15 వరకు
వర్జ్యం : తె.4.06 నుండి 5.15 వరకు
దుర్ముహూర్తం : మ.11.59 నుండి 12.44 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.00 నుండి 10.40 వరకు, సా.5.15 నుండి 5.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలి. శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను రాబట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలి. ఎవరిమీద ఆధారపడకుండా పనులను పూర్తిచేసుకోవడం మేలు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు నిదానంగా జరుగుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. క్రయవిక్రయాలు అంతంతమాత్రంగా ఉంటాయి. వ్యాపారస్తులకు రొటేషన్లు ప్రశ్నార్థకంగా ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం యోగదాయకంగా ఉంటుంది. వాహనయోగం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతున్నాయి. చర్చలు ఫలిస్తాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా పూర్తవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన మాట పట్టింపులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ మార్పుపై నిర్ణయాలకు అనుకూలం కాదు. డబ్బు ఆదా చేయడం వీలుకాదు. శ్రమ ఎక్కువ, ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయి. విహార, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవింగ్స్ పై దృష్టిస్తారు. బ్యాంక్ రుణాలు అందుకుంటారు. సంతానం విషయంలో ఆనందంగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అంచనాలు తారుమారవుతాయి. ప్రణాళికలు తలకిందులవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయపడే ప్రయత్నాలు కలసివస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరికీ అప్పులు ఇవ్వకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా సాగుతుంది. ఎవరైనా ఛాలెంజ్ చేస్తే.. మీదే పైచేయి అవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రగ్రహ ప్రభావంతో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. పెద్దలు, ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారితో వాగ్వివాదాలు చోటుచేసుకోవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మనసుకు నచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆగిపోయిన వ్యవహరాల్లో కదలికలు వస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు కేసుల్లో అనుకూల పరిణామాలు వస్తాయి. ఎలర్జీ సమస్యలతో బాధపడేవారికి ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story