Thu Dec 26 2024 05:57:48 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 9 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఎదుటివారితో చాకచక్యంగా..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, గురువారం
తిథి : బ.చవితి పూర్తిగా
నక్షత్రం : ఉత్తర రా.10.27 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ.10.28 నుండి 11.13 వరకు, మ.3.01 నుండి 3.47 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.4.10 నుండి 4.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడులు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంటుంది. చర్చలు ఫలిస్తాయి. ఫైనాన్స్ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బయటివారికన్నా అయిన వారితోనే రహస్యాలను చెప్పకపోవడం మేలు. కాంట్రాక్ట్ రంగంవారు జాగ్రత్తగా ఉండాలి. ఊహాగానాలకు దూరంగా ఉండాలి. సేవింగ్స్ చేయడం సాధ్యపడదు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అత్యంత ముఖ్యమైన పనులను మాత్రమే చేయడం మంచిది. మిగతా పనులను వాయిదా వేయడం మంచిది. అయినవారి సహాయ సహకారాలు అందుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. పూర్తి కాని పనులపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు అందుతాయి. దంపతుల మధ్య చికాకులు, తగాదాలు తొలగిపోతాయి. శత్రువులపై విజయం పొందుతారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మంచి చెప్పినా అపార్థం చేసుకుంటారు. ఇంట్లో వారితో, బయటి వారితో తక్కువగా మాట్లాడటం మంచిది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మార్పుతో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. వేగంగా పూర్తయ్యే పనులపై దృష్టి సారిస్తారు. వేళకు నిద్రాహాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, సంఘసేవల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఖర్చులు పెరుగుతాయి. శారీరక అలసట పెరుగుతుంది. అంచనాలు ఫలించవు. వాహనప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడాలి. రిస్క్ తో కూడిన వాటికి దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఎదుటివారితో చాకచక్యంగా వ్యవహరించి విజయాలు పొందుతారు. విహారయాత్రలు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా, బయట ప్రశాంతత ఉంటుంది. అన్నింటా మీదే పైచేయి గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి నుండి బయటపడతారు. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా పూర్తి చేసుకుంటారు. నూతన అవకాశాల కోసం ఎదురుచూసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశిలో పుట్టినవారంతా ఈరోజు రిస్క్ కి దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. శత్రుబలం, దృష్టిదోషం పెరుగుతుంది. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గ్రే కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పరిచయస్తుల సహాయ, సహకారాలను పొందుతారు. రిజిస్ట్రేషన్లు సానుకూలమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story