Sun Dec 22 2024 16:30:40 GMT+0000 (Coordinated Universal Time)
WEEKLY HOROSCOPE : నేటి పంచాగం, జులై 2 నుండి జులై 8 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూముల..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, ఆదివారం
తిథి : శు.చతుర్దశి రా.8.16 వరకు
నక్షత్రం : జ్యేష్ఠ ప.1.13 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : సా.5.06 నుండి 5.58 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.10 నుండి 11.45 వరకు
నవగ్రహ సంచారం
మేషం - గురువు, రాహువు
మిథునం - రవి, బుధుడు
సింహం - శుక్రుడు, కుజుడు
కర్కాటకం - శుక్రుడు
తుల - కేతువు
కుంభం - శని
చంద్రగ్రహ సంచారం
వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం
జులై 2 నుండి జులై 8 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ఫైనాన్షియల్ గా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలను మంచిగా ప్లాన్ చేసుకుంటారు. ప్రశాంతంగా ఉంటారు. మనసుకు నచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. హాయిగా ఉంటారు. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్ర నామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆత్మబలంతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాల్లో మార్పు ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కడికి వెళ్లినా చికాకుగానే ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆది, శుక్ర, శని వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం వెసులుబాటు మొదలవుతుంది. ఆర్థికంగా తీరని సమస్యలు తీరే మార్గాలు లభిస్తాయి. తక్కువ మాట్లాడాలి. దానివల్ల తెలియకుండానే లాభపడతారు. వేడిచేసే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవడం మంచిది. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నీ అమరినట్టే ఉంటాయి కానీ.. ఉండవు. అనుమానాలు బలపడుతాయి. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలుంటాయి. విద్యార్థులు మరింత శ్రమించాలి. కాలానుగుణంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తేనే కాస్త అనుకూలంగా ఉంటుంది. ఈ వారం సోమ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్యహృదయ స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూముల విషయంలో తుదినిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులపై చర్యలు తీసుకునేందుకు అనుకూలం. ఇంచుమించుగా అన్నింటా మీదే పై చేయి అవుతుంది. విహారయాత్రలు, వినోద కార్యక్రమాలు మానసిక ఆనందాన్నిస్తాయి. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృథా ఖర్చులు ఎక్కువ. శారీరక అలసట పెరుగుతుంది. ఉద్యోగాల్లో వచ్చే ఒత్తిడులు పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం కాదు. ఈ వారం ఆది, శుక్ర, శనివారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక వెసులుబాటు ప్రారంభమవుతుంది. దంపతుల మధ్య ఒడిదుడుకులు సమసిపోతాయి. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంచుమించుగా వారమంతా సానుకూల ఫలితాలుంటాయి. శ్రమ, ఒత్తిడి మాత్రం విపరీతంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంసోమవారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం శత్రుబలం, దృష్టిదోషం అధికమవుతుంది. ఆత్మధైర్యంతో ముందుకు సాగాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మంచివైద్యం పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆది, బుధవారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సమస్యల నుంచి బయటపడే మార్గాలు లభిస్తాయి. కష్టం పెరుగుతుంది. ఏ పనిలోనూ తృప్తి ఉండదు. ఆధ్యాత్మిక చింతనవైపు మనసు మళ్లుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం సోమ, శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారు అడిగిన ప్రశ్నకు జాగ్రత్తగా సమాధానమివ్వాలి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తక్కువగా మాట్లాడటం, తక్కువగా ఖర్చుపెట్టేందుకు ప్రయత్నించాలి. ఈ వారం ఆది, బుధ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తలు పాటించాలి. గోల్స్ ను పక్కన పెట్టి.. తాత్కాలిక ప్రయోజనాలను తీర్చుకునేందుకు కష్టపడాలి. మొండి బాకీలను వసూలు చేసే ప్రయత్నాలు చేస్తారు. రహస్య శత్రువులను కనిపెట్టడంలో వైఫల్యం చెందుతారు. మొండిధైర్యంతో వ్యవహరిస్తారు. ఈ వారం ఆది, సోమ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఇష్టదైవాన్ని ఎరుపురంగు పూలతో పూజించడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థికంగా, పేరుప్రఖ్యాతులు, అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, శుభకార్యాల ప్రయత్నాలు, నిందలను తొలగించుకునే ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. కోపం, బద్ధకం కంట్రోల్ చేసుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగులకు ఊరటగా ఉంటుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఈ వారం సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దశరథకృత శనిస్తోత్రాన్ని, ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.
Next Story