Sat Nov 23 2024 03:44:10 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే ఏడాది 13 నెలలు.. 19 ఏళ్లకు ఒకసారి ఇలా వస్తుందట
ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జులై 18 నుండి ఆగస్టు 16 వరకూ..సౌరమాన, చంద్రమాన పంచాంగాల ప్రకారం రోజుల లెక్కింపులో
మరో 12 రోజుల్లో 2022 సంవత్సరం ముగియనుంది. 2023 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇప్పటి నుండే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణంగా ఏడాదికి ఉండేది 12 నెలలే. కానీ.. వచ్చే ఏడాది 13 నెలలు ఉన్నాయట. అవి ఇంగ్లీష్ నెలలు కాదండి. తెలుగు నెలలు. హిందూ పంచాంగం ప్రకారం 2023లో 13 నెలలు ఉన్నాయి. వాటిలో అధికంగా వచ్చింది శ్రావణ మాసం. వచ్చే ఏడాది రెండు శ్రావణ మాసాలు రానున్నాయి.
ఇలా 19 సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుందని పురోహితులు చెబుతున్నారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జులై 18 నుండి ఆగస్టు 16 వరకూ అధిక శ్రావణ మాసం ఉంటుంది. సౌరమాన, చంద్రమాన పంచాంగాల ప్రకారం రోజుల లెక్కింపులో ఉన్న తేడాల కారణంగానే ఇలా అధికమాసం వస్తుంది. సౌరమానం ప్రకారం ఏడాదికి 365 రోజుల 6 గంటలు. అదే చంద్రమానం ప్రకారమైతే ఏడాదికి 354 రోజులే ఉంటాయి. ఏడాది లెక్కింపులో ఉండే ఈ తేడాలను అధికమాసం రూపంలో సరిచేస్తుంటారు.
అయితే.. ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసము రావడం తెలిసిందే. ఈ సారి వచ్చే అధిక శ్రావణ మాసము.. 19 ఏళ్లకు వస్తుందట. ముందుగా వచ్చే శ్రావణాన్ని అధికమాసంగా పరిగణిస్తారు. తర్వాత వచ్చే శ్రావణ మాసాన్ని నిజ శ్రావణంగా భావించి.. వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తారు.
Next Story