Thu Dec 26 2024 06:18:57 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 31 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. చర్చలు ఫలిస్తాయి. బెటర్ జాబ్స్..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, మంగళవారం
తిథి : శు.దశమి ఉ.10.11 వరకు
నక్షత్రం : రోహిణి రా.12.39 వరకు
వర్జ్యం : మ.3.51 నుండి 9.43 వరకు, మ.2.59 నుండి 3.44 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.58 నుండి 9.43 వరకు, రా.11.05 నుండి 11.55 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.1.05 నుండి 1.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాన్నీ కీడెంచి మేలెంచాలన్న చందంగా ఆలోచిస్తారు. దంపతుల మధ్య తగాదాలు ఏర్పడుతాయి. శత్రుబలం పెరుగుతుంది. దృష్టిదోషం అధికమవుతుంది. అన్ని వయసుల వారు, అన్ని వృత్తుల వారు పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. సాహసంతో కూడుకున్న పనులపై దృష్టిసారిస్తారు. దంపతుల మధ్య తగాదాలు ఏర్పడుతాయి. వాహనయోగం ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువ. ఖర్చులు పెరుగుతాయి. చర్చల్లో పనులను వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త అవకాశాలు కలసివస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఆరోగ్య నియమావళిని పాటిస్తారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలను అందుకుంటారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య తగాదాలు పరిష్కారమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. మీ తప్పు లేకపోయినా మాటపడాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. ఇంట, బయట ఒత్తిడి పెరుగుతుంది. పనులు వాయిదా ధోరణిలో కొనసాగుతుంటాయి. ఇంట్లో ఉన్నవారితో మాట పట్టింపులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులను ఈ రోజు ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. శత్రుబలం పెరుగుతుంది. పనులు నత్తనడకన సాగుతాయి. రిస్క్ తో ఉన్న పనికి దూరంగా ఉండాలి. ఎదుటివారిని నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బ్యాంక్ రుణప్రయత్నాలు కలసివస్తాయి. పూర్తికావనుకున్న పనులు పూర్తవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. చర్చలు ఫలిస్తాయి. బెటర్ జాబ్స్ ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. గృహ, వాహన కొనుగోళ్లకు ఆటంకాలు తొలగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా ధోరణిలో కొనసాగుతాయి. ఎదుటివారితో మాట పడటం లేదా మాట అనడంతోనే పనులను పూర్తిచేస్తారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడులను లౌక్యంగా అధిగమిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు తప్పవు అనుకున్న పనులపై దృష్టిసారించాలి. కాంట్రాక్ట్ రంగం వారు దృష్టి సారించాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. నిందలు, ఆరోపణలు అధికమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story