Fri Dec 27 2024 10:32:48 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 10 : నేటి పంచాగం, ఈ రాశుల వారికి అన్నింటా విజయమే..
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కలసివచ్చే వర్గం చేరువలో ఉంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, మంగళవారం
తిథి : బ.తదియ మ.12.08 వరకు
నక్షత్రం : ఆశ్లేష ఉ.9.01 వరకు
వర్జ్యం : రా.10.26 నుండి 12.13 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.55 నుండి 9.40 వరకు, రా.10.57 నుండి 11.49 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.1.00 నుండి 1.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నట్టే అనిపించినా.. ఖర్చులు పెరుగుతాయి. అన్ని వయసులవారికి ఒత్తిడి పెరుగుతుంది. వీలైనంతవరకూ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లు పెండిగ్ లో ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. కాంట్రాక్ట్ రంగాల వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ప్రేమలు ఫలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఉపాధ్యాయ, న్యాయవాద, వైద్య, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి సానుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత తక్కువగా మాట్లాడటం మంచిది. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలలో సక్సెస్ అవుతారు. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కలసివచ్చే వర్గం చేరువలో ఉంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మంచి సలహాలు, సూచనలు అందుకుంటారు. చురుకుగా పనిచేస్తారు. సానుకూల వాతావరణం నెలకొంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు చోటుచేసుకుంటాయి. అనుకూలించే వర్గం చేరువలో ఉండదు. ఊహలు రాజ్యమేలుతాయి. అపోహలు ఏర్పడుతాయి. శ్రమ ఎక్కువ.. ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు శారీరక, మానసిక అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్నివిధాలా అనుకూలిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతాయి. ఆగిపోయిన పనుల్లో కదలికలు వస్తాయి. పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయి. న్యాయ సంబంధింత సంప్రదింపులు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకూలమైన కాలం. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. విద్య, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సమస్యలను అవలీలగా పరిష్కరించుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అంచనాలు తారుమారవుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. పనులను వాయిదా వేసుకుంటారు. తప్పవనుకున్న పనులు చేయవలసినపుడు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. గతం తాలూకా ఘటనలు గుర్తుచేసుకంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని వృత్తులు, అన్ని వయసుల వారు రిస్క్ లేని పనులపై మాత్రమే దృష్టి సారించడం మంచిది. జరిగిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. పాతపరిచయాలను గుర్తుచేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచి సలహాలు, సూచనలు కలసివస్తాయి. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆగిపోయిన పనుల్లో కదలికలు ఏర్పడుతాయి. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. వివాదాస్పద విషయాలను పరిష్కరించుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. కొత్త విషయాలను, రహస్యాలను తెలుసుకుంటారు. ప్రయాణాలు ఫలప్రదమవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రతి విషయంలోనూ సానుకూలతలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story