Fri Dec 27 2024 10:02:04 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 12 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్నివిధాలా కాలం అనుకూలంగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, గురువారం
తిథి : బ.పంచమి సా.4.37 వరకు
నక్షత్రం : పుబ్బ మ.2.25 వరకు
వర్జ్యం : రా.10.16 నుండి 12.01 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.25 నుండి 11.09 వరకు, మ.2.51 నుండి 3.35 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.9.00 నుండి 9.40 వరకు, సా.5.30 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. పొరపాట్లు జరిగిపోయాక.. ఇలాంటి పని చేసింది నేనేనా అని ఆలోచిస్తారు. పెద్దల సలహాల మేరకు పనులు ప్రారంభించడం మంచిది. కాంట్రాక్ట్, ఫైనాన్స్ రంగాల వారు, వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. రుణాలు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడుతాయి. ఎదుటివారిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అసౌకర్యానికి గురవుతారు. ఊహాగానాలకు దూరంగా ఉండటం మంచిది. లాయర్లు, మిషనరీ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. దంపతుల మధ్య తగాదాలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వైద్యుల సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. ప్రతి విషయంలో ఆలోచిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ప్రేమలు ఫలిస్తాయి. నిద్రలోపం కారణంగా ఇబ్బంది పడతారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఉపయోగకరమైన ఖర్చులుంటాయి. వీలైనంత తక్కువ మాట్లాడటం మంచిది. అనవసరమైన వివాదాలకు తావివ్వొద్దు. అధికారుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయత్నాలు ఎదురవుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలమైన ఫలితాలుంటాయి. ఎదుటివారికి సలహాలు, సూచనలు ఇస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. రోజంతా హాయిగా గడిచిపోతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారితో తక్కువగా మాట్లాడటం మంచిది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడం ఉత్తమం. సంతకాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడానికి ఎంతదూరంగా ఉంటే అంత మేలు కలుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్నివిధాలా కాలం అనుకూలంగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు, మొండిబాకీలను వసూలు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. గాయాలు అవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన కాలం నడుస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలమైన ఫలితాలుంటాయి. కెరియర్ పై దృష్టి సారిస్తారు. ఉద్యోగ ఉన్నతికి ప్రయత్నిస్తారు. ఉపయోగకరమైన సమాచారాన్ని అందుకుంటారు. ప్రతివిషయాన్ని కూలంకషంగా ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. నిరుత్సాహానికి దూరంగా ఉంటే.. అన్నింటా విజయం వరిస్తుంది. కొత్తవారిని నమ్మేందుకు జంకుతారు. పాతపరిచయాలు కూడా అంతంతమాత్రంగానే ఉపకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ తో కూడుకున్న కార్యక్రమాన్ని చేయకపోవడం మంచిది. వస్తువులు కనిపించక అసౌకర్యానికి గురవుతారు. అనవసరమైన వాగ్వివాదాలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా కలసివస్తుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా కొనసాగుతాయి. పెండింగ్ బిల్స్ క్లియర్ అవుతాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా సాగుతాయి. నూతన పరిచయాలు ఉపకరిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. తీరని సమస్యలపై దృష్టిసారిస్తారు. దుబారా ఖర్చులు చేస్తారు. సమస్యలను కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story