Fri Dec 27 2024 10:36:49 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 13 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. శ్రమ ఎక్కువ.. ఫలితాలు అంతంత మాత్రంగా
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, శుక్రవారం
తిథి : బ.షష్ఠి సా.6.17 వరకు
నక్షత్రం : ఉత్తర సా.4.36 వరకు
వర్జ్యం : రా.1.34 నుండి 3.17 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.56 నుండి 9.41 వరకు, మ.12.38 నుండి 1.23 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన వెసులుబాటు ఏర్పడుతుంది. నిందల నుండి బయటపడతారు. కాంట్రాక్ట్ రంగాల వారికి, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఎదుటివారిని అంచనా వేయడంలో విఫలమయ్యే ప్రమాదం ఉంది. అనవసరమైన వివాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఉత్సాహం తగ్గుతుంది. ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తుల అమ్మకాల విషయంలో పెద్దల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. పని ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సంతకానికి విలువ పెరుగుతుంది. తగాదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఎదుటివారితో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. బ్యాంకింగ్స్, ఫైనాన్స్, మిషనరీ వ్యాపారులు, క్రీడా రంగాలవారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. శ్రమ ఎక్కువ.. ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ప్రతి పనీ వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తారు. చికాకులు, కోపం పెరుగుతాయి. దంపతుల మధ్య విభేదాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. తీరిక లేకుండా గడుపుతారు. వ్యాపారస్తులు, ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా సహకరిస్తుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. కెరియర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుటివారి సహాయ సహకారాలు అందుకుంటారు. ఇంట్లోని గొడవల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఊరటగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనులు వాయిదా పడతాయి. రహస్య శత్రువులు పెరుగుతారు. నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకుని ముందుకు సాగడం మంచిది. తొందరపాటు తగదు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వీలైనంత వరకూ పనులు వాయిదా వేయడం మంచిది. తల్లితరపున బంధువులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. వాహనాలు నడిపేటపుడు ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన చింత తగ్గుతుంది. శుభకార్యాలు ముందుకు సాగుతాయి. మెదడుకు పదునుపెట్టి.. పనులు పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. దృష్టిదోషం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story