Thu Dec 26 2024 19:00:33 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 14 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులుఈ రోజు ఆహ్లాదంగా గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారస్తులకు ..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, శనివారం
తిథి : బ.సప్తమి రా.7.22 వరకు
నక్షత్రం : హస్త సా.6.14 వరకు
వర్జ్యం : తె.2.33 నుండి 4.13 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.43 నుండి 8.12 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.8.00 నుండి 8.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. దంపతుల మధ్య వివాదాలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు నిదానంగా సాగుతాయి. అర్థంచేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. శారీరక, మానసిక అలసట పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు మెరున్ కలర్.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వాయిదా పడుతుంటాయి. పనులు నిర్వహణలో బద్ధకం పెరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. స్థిర చరాస్తులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నేవీ బ్లూ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఊహించిన దానికంటే రకరకాల వ్యవహారాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. సంఘంలో గౌరవం కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. రోజంతా గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులుఈ రోజు ఆహ్లాదంగా గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు కలసివస్తాయి. మానసిక ఆందోళన ఉన్నా.. పనులను వేగంగా పూర్తిచేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన వివాదాలు చోటుచేసుకుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. సాయంత్రం తర్వాతి నుండే కాలం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రహస్య శత్రువుల్ని కనుగొంటారు. కోర్టు వ్యవహారాలు కలసివస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. రోజంతా ఆనందంగా గడుస్తుంది కానీ.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు భవిష్యత్ పై దృష్టి పెరుగుతుంది. ఆశించిన ప్రకారంగానే రోజు గడుస్తుంది. ఆశించిన స్థాయిలో రుణాలు అందుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్నచిన్న పొరపాట్లు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికపరంగా నిరుత్సాహం కలుగుతుంది. అన్ని వయసుల వారు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వివాహాది శుభకార్యాలు ముందుకు సాగుతాయి.శుభవార్తలు వింటారు. బంధువర్గంతో ఆనందంగా గడుపుతారు. ఖర్చులు స్వల్పంగా పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story