Thu Dec 26 2024 18:41:46 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 18 : నేటి పంచాగం, ఈ నాలుగు రాశుల వారికీ నేడు ఖర్చులు విపరీతం
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఒంటరితనాన్ని ఇష్టపడతారు. పాత స్నేహితులు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్య మాసం, బుధవారం
తిథి : బ.ఏకాదశి సా.4.03 వరకు
నక్షత్రం : అనూరాధ సా.5.23 వరకు
వర్జ్యం : రా.10.30 నుండి 11.57 వరకు
దుర్ముహూర్తం : మ.11.56 నుండి 12.40 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : మ.2.00 నుండి 2.53 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకుని ముందుకు సాగాలి. ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఎందుకు ఖర్చు పెడుతున్నారో కూడా అర్థంకాని పరిస్థితి ఉంటుంది. ప్రయాణాలకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. రహస్యాలను ఎవరికీ చెప్పకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. భవిష్యత్ పై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. చికాకు, శ్రమ ఎక్కువగా ఉన్నా పనుల్లో వేగం పుంజుకుంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. అప్పులు తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంక్ రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా.. ఉపయోగకరంగా ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. శ్రమ ఎక్కువ.. ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ప్రతి పనిలో ఒక అడుగు ముందుకేస్తే.. రెండు అడుగులు వెనక్కి వేస్తారు. చర్చ లేకుండా ముందుకు సాగడం మంచిది. వ్యాపారస్తులు రొటేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో తగాదాలు, విభేదాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఒంటరితనాన్ని ఇష్టపడతారు. పాత స్నేహితులు, పాత పరిచయాలు అందుబాటులో లేకపోవడంతో.. మీ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. వాహనాల విషయంలో మరమ్మతులు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. చర్చలు ఫలప్రదమవుతాయి. అపోహలు తొలగిపోతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. కొనుగోళ్లపై దృష్టి సారిస్తారు. గతంలో చేసిన పొదుపు అక్కరకు వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగులు లేత రంగులు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విపరీతంగా ఖర్చయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత తక్కువగా మాట్లాడితే అంతమంచిది. ఎదుటివారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. మీపై అనవసరమైన ఫిర్యాదులు వస్తాయి. కారణం లేకుండానే మనసంతా చికాకుగా ఉంటుంది. ఇంట, బయట ఒత్తిడులు చోటుచేసుకుంటాయి. వాహనప్రమాదాలు జరగవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి.నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. న్యాయవాదులను సంప్రదించే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. వ్యాపారస్తుల ఆలోచనలు బలపడతాయి. ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులుఈ రోజు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. మంచికిపోతే చెడు ఎదురవుతుంది. ఇంట్లో వారు కూడా అపార్థం చేసుకుంటారు. ప్రేమికులు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. ఆర్థికపరంగా ఒడిదుడుకులు తప్పవు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. పొదుపుపై దృష్టి సారిస్తారు. భార్య, భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడుతాయి. విశ్రాంతిని అధికంగా కోరుకుంటారు. పాత స్నేహితులు, శ్రేయోభిలాషులతో మాట్లాడటంతో ప్రశాంతత పొందుతారు. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన అవకాశాలు వస్తాయి. పెళ్లిచూపులు, వివాహాది శుభకార్యాలు సానుకూలంగా సాగుతాయి. ఏ పనిచేస్తే ఎంత లాభం వస్తుందనే ఆలోచిస్తారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. నీరసం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పనులు వాయిదా ధోరణిలో సాగుతాయి. వ్యవసాయ రంగాలవారు, ఫైనాన్స్ రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story