Thu Dec 26 2024 18:41:46 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 19 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. పనులు జరుగుతాయి కానీ.. తృప్తి ఉండదు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్య మాసం, గురువారం
తిథి : బ.ద్వాదశి మ.1.18 వరకు
నక్షత్రం : జ్యేష్ఠ మ.3.18 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : రా.10.25 నుండి 11.51 వరకు, మ.2.54 నుండి 3.39 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.4.02 నుండి 4.48 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా సాగుతున్నాయి. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా సాగించుకుంటారు. మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. చర్చలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలు ఏర్పడవచ్చు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అంచనాలు తారుమారవుతాయి. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడానికి దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహం కలుగుతుంది. పరిస్థితులను పట్టించుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. పాత, కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలు అనుకూలతలను కలిగిస్తాయి. భార్య, భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంచనాలు తారుమారవుతాయి. రుణ ప్రయత్నాలు అంతంతమాత్రంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలతో పాటు మానసిక ప్రశాంతత తగ్గుతుంది. వ్యాపారస్తులకు రొటేషన్లు ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు సానుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, కాంట్రాక్ట్ రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. మనస్ఫర్థలు తొలగిపోతాయి. శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పార్ట్ టైం జాబ్స్ పై దృష్టిని సారిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. పనులు జరుగుతాయి కానీ.. తృప్తి ఉండదు. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. దంపతుల మధ్య తగాదాలు చోటుచేసుకుంటాయి. క్రయవిక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి పనులు మినహా దేనిపైనా దృష్టి పెట్టకపోవడం మంచిది. కీలక నిర్ణయాలు తీసుకునే విషయాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలసివస్తాయి. శుభకార్యాల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. చురుకుగా పనిచేస్తారు. మంచి తెలివితేటలతో లౌక్యాన్ని ప్రదర్శిస్తారు. పూర్తి కావు అనుకున్న పనులను కూడా పూర్తిచేస్తారు. ప్రయాణాలు కలసివస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన ఫలితాలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. పనులు పూర్తికావు, వాయిదా పడవు. లాభనష్టాలు ఉండవు. శ్రమ పెరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు చికాకుగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఏ పని చేయాలన్నా వాయిదా పడుతుంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇబ్బందులు పెరుగుతాయి. పనులు వాయిదా పడుతుంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story