Thu Dec 26 2024 18:56:47 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 20 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఖర్చులు ఉన్నా..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్య మాసం, శుక్రవారం
తిథి : బ.త్రయోదశి ఉ.9.59 వరకు, బ. చతుర్దశి తె.6.17 వరకు
నక్షత్రం : మూల మ.12.40 వరకు
వర్జ్యం : మ.11.15 నుండి 12.40 వరకు, రా.9.04 నుండి 10.28 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.57 నుండి 9.42 వరకు, మ.12.41 నుండి 1.25 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.2.05 నుండి 2.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఎదుటివారు ఔనని చెప్పక.. కాదని చెప్పకపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమవుతారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులు శ్రద్ధ కనబరచాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. అప్పులకు ఎంతదూరంగా ఉంటే.. అంతమంచిది. శత్రుబలం పెరుగుతుంది. దృష్టిదోషం అధికమవుతుంది. పెళ్లి చేసుకోబోయే వారు తమకు కాబోయే జీవిత భాగస్వాములతో ఎంత తక్కువగా మాట్లాడితే.. అంత మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అపార్థాలు దూరమవుతాయి. కోర్టు కేసులపై దృష్టిసారిస్తారు. బెటర్ జాబ్స్ ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి, వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలుంటాయి. ఆరోగ్యం కాస్త నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మితే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఖర్చులు ఉన్నా.. సర్దుబాటు చేసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తెలియని ఆందోళన వెంటాడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిస్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రయవిక్రయాలు కలసివస్తాయి. ప్రవృత్తిపై దృష్టి సారిస్తారు. పెంపుడు జంతువు, మొక్కలు నాటడంపై ఆసక్తిగా ఉంటారు. మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. అపార్థాలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యం నలతగా ఉండొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగులు లేత రంగులు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. మంచికిపోతే చెడు ఎదురవుతుంది. తప్పనిసరిగా చేయాల్సిన పనులు మినహా.. మిగతా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. వయసులో పెద్దవారైన వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. అనవసరమైన విషయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది. తీరిక లేకుండా గడుపుతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభకార్యాల విషయాలు సానుకూలంగా ఉంటాయి. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ప్రయాణాలతో లాభం పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story