Thu Dec 26 2024 19:10:55 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 23 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్న తర్వాతి నుండి అనుకూలంగా ఉంటుంది. శుభ సమాచారాలు అందుకుంటారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, సోమవారం
తిథి : శు. విదియ సా.6.43 వరకు
నక్షత్రం : ధనిష్ఠ తె.12.26 వరకు
వర్జ్యం : ఉ.6.52 నుండి 8.16 వరకు
దుర్ముహూర్తం : మ.12.42 నుండి 1.26 వరకు, మ.2.56 నుండి 3.41 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.15 నుండి 9.50 వరకు, సా.4.10 నుండి 4.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంటుంది. వివాహాది శుభకార్యాలు సానుకూలమవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్ రంగాల వారికి అనుకూంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం నుండి అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ఆర్థిక పరమైన అంశాలు, కీలకమైన అంశాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఎంతో జాగ్రత్తగా మెలగాలి. ఖర్చులు పెరుగుతాయి. ఉపయోగం లేని పనులు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఒక మాట అంటే.. అది మరో రకంగా చేరే అవకాశాలు ఎక్కువ. అపోహలు, అపార్థాలు పెరుగుతాయి. వ్యాపారస్తులు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు మధ్యాహ్నంలోగా పూర్తి చేసుకోవాలి. మొహమాటానికి కొన్ని పనులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. అంతా నాకే తెలుసన్న ధోరణి నష్టాలను చేకూరుస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సమీకరణాలు కలసివస్తాయి. ఇంటర్వ్యూలు ముందుకి సాగుతాయి. ప్రేమలు ఫలిస్తాయి. అపోహలు తొలగిపోతాయి. ఎదుటివారితో ఏం మాట్లాడినా.. వెంటనే అంగీకారం లభిస్తుంది. ప్రయాణాలు సానుకూలంగా సాగుతాయి. సంతానం విషయాలు అనుకూలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్న తర్వాతి నుండి అనుకూలంగా ఉంటుంది. శుభ సమాచారాలు అందుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. స్నేహాలు ఉపకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. తప్పనిసరిగా చేయాల్సిన పనులు మినహా.. మిగతా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అప్పులివ్వడం, తీసుకోవడానికి ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. అంచనాలు తారుమారవుతాయి. రహస్య శత్రువులు పెరుగుతారు. దృష్టిదోషం పెరుగుతుంది. తెలియని ఆందోళన వెంటాడుతుంది. రోజంతా వివాదాస్పదంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. అధికారులతో సంప్రదింపులు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు, ఆర్థిక సర్దుబాట్లకు, రిజిస్ట్రేషన్లు వంటి వాటిని మధ్యాహ్నం లోగా పూర్తిచేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అపోహలు ఏర్పడుతాయి. తగాదాలు, వివాదాలు జరుగుతాయి. మధ్యాహ్నం తర్వాతి నుండి.. వాటి నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన ఉత్సాహం కలుగుతుంది. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలుంటాయి. పనులకు ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగులు లేత రంగులు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ మాత్రమే అనుకూల ఫలితాలుంటాయి. ఆ తర్వాతి నుండి పనివేళలు పెరుగుతాయి. చిరాకు పెరుగుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఫలితాలు తక్కువగా వస్తాయి. అధికారులతో వాగ్వాదాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలను మధ్యాహ్నంలోగా పూర్తిచేసుకోవడం మంచిది. అపార్థాలు, అపోహలు పెరుగుతాయి. మానసిక ఆందోళన నెలకొంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
Next Story