Thu Dec 26 2024 18:20:38 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 24 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు సానుకూలంగా ఉన్నాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, మంగళవారం
తిథి : శు.తదియ మ.3.22 వరకు
నక్షత్రం : శతభిషం రా.9.58 వరకు
వర్జ్యం : ఉ.6.54 నుండి 8.20 వరకు, మ.3.52 నుండి 5.20 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.58 నుండి 9.43 వరకు, రా.11.03 నుండి 11.54 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.1.05 నుండి 1.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మాట కటువుగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ ఏ పని పూర్తిచేయాలన్నా తగాదాలు ఏర్పడటం లేదా ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు మెరున్ కలర్.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఆర్థిక సర్దుబాట్లు కష్టంగా ఉంటాయి. రుణ ప్రయత్నాలు తప్పకపోవచ్చు. ఫైనాన్స్ రంగాలో వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గోల్డ్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆరోగ్య, ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోకతప్పదు. తప్పనిసరి పనులు మినహా మిగతా వాటిపై దృష్టిసారించాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ తో నష్టపోయే సూచనలున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు సానుకూలంగా ఉన్నాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. బంగారం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఇతరుల నుండి సహాయ, సహకారాలు అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సర్దుబాట్లు చేసుకోగలుగుతారు. క్రయవిక్రయాలు సజావుగా సాగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి, వ్యాపారస్తులకు, స్వయం ఉపాధి వారికి అనుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. మీ ప్రమేయం లేకుండానే తగాదాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇంట్లో ఉండేవారు అర్థంచేసుకోకపోవడంతో చిరాకుగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత యధావిధిగా ఉంటుంది. పనిపై కంటే.. విశ్రాంతికే ప్రాధాన్యతనిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎగుమతి దిగుమతుల బిజినెస్ చేస్తున్న వారికి లాభసాటిగా ఉంటుంది. అప్పుల సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్తపరిచయాలు ఏర్పడుతాయి. శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఇంటి అలంకరణపై దృష్టి పెడతారు. అపార్థాలు, దృష్టిదోషం పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభవార్తలు వింటారు. ఎక్కడికి వెళ్లినా ఆర్థిక లాభం లేదా మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రయాణాలు కలసివస్తాయి. సంప్రదింపులు సానుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రిస్క్ కి దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడం కష్టమే. కోర్టు కేసుల్లో పురోగతి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story