Thu Dec 26 2024 18:39:20 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 25 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ప్రతి విషయాన్ని కీడెంచి మేలెంచాలన్న చందంగా వ్యవహరిస్తారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, బుధవారం
తిథి : శు.చవితి మ.12.34 వరకు
నక్షత్రం : పూర్వాభాద్ర రా.8.05 వరకు
వర్జ్యం : తె.5.14 నుండి 6.45 వరకు
దుర్ముహూర్తం : మ.11.57 నుండి 12.42 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.05 నుండి 10.53 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పూర్తికావనుకున్న పనులు పూర్తవుతాయి. రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలుంటాయి. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సజావుగా సాగుతుంది. నూతన ఆలోచనలు చేస్తారు. రహస్య శత్రువులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. ప్రతి విషయంలో అడ్డంకులు ఏర్పడుతాయి. ఎదుటివారిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పాతపరిచయస్తులు, స్నేహితులతో చిన్న చిన్న తగాదాలుంటాయి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. పనులు వాయిదా పడటం ఇబ్బందిగా ఉంటుంది. రహస్యాలను పంచుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ఎదుటివారిని అంచనా వేయగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. ప్రతి విషయంలో సంశయాత్మకంగా వ్యవహరిస్తారు. ఉన్నతాధికారుల నుండి ఒత్తిడులు ఎదురవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ప్రతి విషయాన్ని కీడెంచి మేలెంచాలన్న చందంగా వ్యవహరిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారిని అపార్థం చేసుకుంటారు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. నూతన పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. భవిష్యత్ దృష్ట్యా వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రహస్యాలను గోప్యంగా ఉంచుతారు. పాతపరిచయాలు ఉపకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు శ్రమ ఎక్కువ, ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. క్రయవిక్రయాలు కలసివస్తాయి. రిజిస్ట్రేషన్లు సానుకూలంగా సాగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రుబలం, దృష్టిదోషం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన అవకాశాలు కలసివస్తాయి. ప్రతి విషయాన్ని కొత్తపద్దతుల్లో పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. చర్చలు ఫలిస్తాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నష్టాలకు , మోసాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్స్ రంగంలోవారు జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ లేని విషయాలపై దృష్టిపెట్టడం మంచిది. అప్పులివ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story