Thu Dec 26 2024 18:59:19 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 26 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పక్కనే ఉండి ఉచిత సలహాలిచ్చేవారిని..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, గురువారం
తిథి : శు.పంచమి ఉ.10.28 వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర సా.6.57 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ.10.28 నుండి 11.13 వరకు, మ.2.57 నుండి 3.42 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.20 నుండి 11.50 వరకు, సా.4.30 నుండి 5.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. పనివేళలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను మధ్యాహ్నం తర్వాత మొదలుపెట్టడం మంచిది. శుభవార్తలు వింటారు. మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమలు ఫలిస్తాయి. అప్పులు తీర్చే ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాతి నుండి పనులు వాయిదా పడుతుంటాయి. అలసట పెరుగుతుంది. ప్రయాణాలు కూడా వాయిదా పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. న్యాయవ్యవహారాలను పూర్తి చేసేందుకు కాలం కలసివస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పక్కనే ఉండి ఉచిత సలహాలిచ్చేవారిని పట్టించుకోకపోవడం మంచిది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పెట్టుబడులపై తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు లేత నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సమస్య వెనుక సమస్య వచ్చే ప్రమాదం ఉంది. అప్పు తీర్చాక.. మరో అప్పు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు, ఇతర చర్చలకు సంబంధించిన అంశాలను మద్యాహ్నం లోపు పూర్తిచేసుకోవడం మంచిది. గడిచిన సంఘటనలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అన్నిరంగాల వారికి కాలం కలిసివస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు లేత పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ చిరాకుగా ఉన్నా.. ఆ తర్వాతి నుండి ఉత్సాహంగా ఉంటారు. వైద్య సంప్రదింపులు చేస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అప్పులు తీసుకోవడం, ఇవ్వడానికి దూరంగా ఉండాలి. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. అన్ని వయసుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలు, నూతన స్నేహాలు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత తీసుకునే కొన్నినిర్ణయాలు వాయిదా పడుతుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుండి అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన నిర్ణయాలు కలసివస్తాయి. భవిష్యత్ పై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.
Next Story