Thu Dec 26 2024 19:12:19 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 27 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆరోగ్య స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్రవారం
తిథి : శు.షష్ఠి ఉ.9.10 వరకు
నక్షత్రం : రేవతి సా.6.37 వరకు
వర్జ్యం : ఉ.6.47 నుండి 8.21 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.58 నుండి 9.43 వరకు, మ.12.43 నుండి 12.00 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.2.10 నుండి 2.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారస్తుల రొటేషన్లు అనుకూలంగా సాగుతాయి. విద్యార్థినీ, విద్యార్థులు విద్యాసంబంధమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు వృత్తి, ఉద్యోగాలకు అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు ఉపయోగించుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. పాతపరిచయాలు బలపడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లభిస్తుంది. నూతన ఉద్యోగాలకోసం ప్రయత్నాలు గట్టిగా చేయాల్సి ఉంటుంది.వైద్య సలహాలు, సూచనలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయం కష్టతరంగా మారుతుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి పనులు మినహా మిగతా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. రిస్క్ తో కూడుకున్న పనులకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆరోగ్య స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. ప్రతి వ్యాపారంలో లాభాలుంటాయి. కొత్త ఆలోచనలను కార్యరూపం తీసుకొచ్చే ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. చర్చలు ఫలిస్తాయి. క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం అభివృద్ధి మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇంటిపోరు తప్పకపోవచ్చు. పనుల విషయంలో సతమతమవుతారు. అంచనాలు తారుమారవుతాయి. నమ్మకస్తులెవరో తెలియక అయోమయంలో పడతారు. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వాహన యోగం ఉండొచ్చు. స్థిరాస్తిపై దృష్టి సారిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. వేళకు నిద్రాహారాలతో ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజంతా యథాతథంగా కొనసాగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంది. చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. అన్నిరకాల మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మంచికిపోతే చెడుఎదురైందన్నట్టుగా కాలం సాగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలకు అనుకూలం కాదు. పనులను వీలైనంత వరకూ వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహంతో ఉంటారు. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. సమస్యల నుండి బయటపడతారు. ఆనందంగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. తప్పనిసరి పనులు మాత్రమే పూర్తిచేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులపై సలహాలు తీసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story