Mon Dec 23 2024 03:06:50 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, జనవరి 29 నుండి ఫిబ్రవరి 4 వరకు వారఫలాలు, పరిహారాలు
ఏ పని చేయాలన్నా మీరు శ్రమించకుండా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా లాభనష్టాలుండవు. ఆరోగ్యం పై శ్రద్ధ..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, ఆదివారం
తిథి : శు.అష్టమి ఉ.9.05 వరకు
నక్షత్రం : భరణి రా.8.21 వరకు
వర్జ్యం : తె.5.12 నుండి ఉ.6.53 వరకు
దుర్ముహూర్తం : సా.4.28 నుండి 5.13 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : లేవు
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
వృషభం - కుజుడు
తుల - కేతువు
కన్య - బుధుడు
మకరం - రవి
కుంభం - శుక్రుడు, శని
మీనం -గురువు
చంద్రగ్రహ సంచారం
మేషం, వృషభం, మిథునం, కర్కాటకం
జనవరి 29 నుండి ఫిబ్రవరి 4 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. బయటివాళ్లు మెచ్చుకున్నంతగా.. బయటివారు గౌరవించినంతగా ఇంట్లో ఉన్నవారు మెచ్చుకునేందుకు, అర్థం చేసుకునేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. మాట కటువుగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉన్న ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలుంటాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ వారం ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టాలనుకున్న సందర్భాల్లో ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాలి. విలువైన వస్తువులను జాగ్రత్త చేసుకోవాలి. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు మంచిది కాదు. కళా, సాహిత్య, క్రీడా రంగాల వారికి అనుకూలతలు ఉంటాయి. క్షణం తీరిక ఉండదు. పైసా ఆదాయం ఉండదన్న చందంగా ఉంటుంది. ఈ వారం సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇంట్లో ఉన్నవారితో ఎక్కువగా మాట్లాడితే తగాదాలు ఏర్పడవచ్చు. శ్రమ ఎక్కువగా ఉండటంతో అలసట పెరుగుతుంది. విదేశీయాన ప్రయాణాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఎదుటివారితో మాట్లాడేటపుడు చాకచక్యంగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో టెన్షన్లు పెరుగుతాయి. ఈ వారం ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ప్రశాంతంగా ఉంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీవారెవరో.. కానివారెవరో కనువిప్పు కలుగుతుంది. నొప్పులు బాధిస్తాయి. పెళ్లి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ఈ వారం ఆది, సోమ, మంగళ శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏ పని చేయాలన్నా మీరు శ్రమించకుండా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా లాభనష్టాలుండవు. ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకుంటారు. ఫంక్షన్లలో అట్రాక్షన్ గా ఉంటారు. విలువైన ఆస్తులను అమ్మే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీ వైపు తప్పున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. సమస్య నుండి బయటపడే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రయ, విక్రయాలకు సంబంధించిన విషయాలు కలసివస్తాయి. శుభ కార్యాల ప్రయత్నాలు సానుకూల పడతాయి. విదేశీయాన ప్రయత్నాల్లో వ్యతిరేక ఫలితాలుంటాయి. అర్థంలేని పుకార్లు షికార్లు చేస్తాయి. అపనిందలు పడతాయి. కష్టపడేందుకు ఇష్టపడతారు. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం వృత్తి, ఉద్యోగాల పరంగా ఒత్తిడి పెరుగుతుంది. పనివేళలు పెరుగుతాయి. అధికారులు చెప్పే విషయాలు అర్థంకాక ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులకు రొటేషన్లు టైట్ గా ఉంటాయి. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. రూపాయిని ఆదా చేయలేక విసిగిపోతారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు రావొచ్చు. భవిష్యత్ పై దృష్టి పెట్టడంతో.. దేనిని ఎంజాయ్ చేయలేరు. బంధువులతో తరచుగా తగాదాలు, విభేదాలు రావొచ్చు. ఈ వారం ఆది, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శివకవచ స్తోత్రం పఠిస్తూ.. యధాశక్తిగా దుర్గాదేవిని పూజించటం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. బాధ్యతలు బరువుగా ఉంటాయి. ఇంట్లోవారికి ధైర్యం చెబుతూ.. ప్రతి పనిని దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతాయి. సహకరించే వర్గం లేక టైమ్ వేస్ట్ అవడంతో పాటు అలసట పెరుగుతుంది.ఇంట్లోవారితో మాట్లాడే అవకాశం కూడా ఉండక.. మాట పట్టింపులు ఏర్పడుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ వారం ఆది, సోమ, మంగళవారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అప్పులను తిరిగి రాబట్టే ప్రయత్నాలు చేస్తారు. కోర్టుకేసులు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగమార్పుని కోరుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. శుభకార్యాల్లో అవాంతరాలు లేకుండా ముందుకి సాగుతాయి. ఆర్థిక విషయాలు యదాతథంగా ఉన్నాయి. మానసిక సంఘర్షణ పెరగకుండా ప్రయత్నించాలి. కాళ్లనొప్పులు పెరుగుతాయి. లో ఫీవర్ తో ఇబ్బంది పడతారు. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఏ పెట్టుబడి పెట్టాలనుకున్నా అనుభవజ్నుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. కాంట్రాక్ట్ రంగంవారు అధికంగా శ్రమిస్తారు. ఫైనాన్స్, రాజకీయ, క్రీడా రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆది, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్దారక స్తోత్రాన్ని యధాశక్తిగా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. మిగతా విషయాల్లో ఇబ్బందులుండవు. బంగారం తాకట్టు పెట్టనంతవరకూ ఇబ్బందులుండవు. రహస్యాలను తెలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. ఈ వారం సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్ర నామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story