Thu Dec 26 2024 05:57:13 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 30 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. పూర్తికావు అనుకున్న..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, సోమవారం
తిథి : శు.నవమి ఉ.10.11 వరకు
నక్షత్రం : కృత్తిక రా.10.15 వరకు
వర్జ్యం : ఉ.9.18 నుండి 11.02 వరకు, మ.2.59 నుండి 3.44 వరకు
దుర్ముహూర్తం : మ.12.43 నుండి 1.28 వరకు, మ.2.59 నుండి 3.44 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.10 నుండి 9.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తక్కువగా మారే ప్రయత్నం చేయాలి. తగాదా పడితే తప్ప పూర్తి కావనుకున్న పనులపై దృష్టిసారించాలి. క్రిమినల్ లాయర్లు, పోలీసులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఒత్తిళ్లు తట్టుకుని నిలబడతారు. శత్రుబలం పెరుగుతుంది. కోర్టుకేసులపై దృష్టి సారించాలి. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. రిస్క్ కు ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. పూర్తికావు అనుకున్న పనులపై దృష్టి సారిస్తారు. కష్టాలు అవలీలగా తొలగిపోతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. మొండి బాకీలను రాబట్టుకుంటారు. శత్రుబలం తగ్గుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. నీలాపనిందలు పడొచ్చు. విద్యార్థినీ విద్యార్థులు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. భార్య, భర్తల మధ్య సయోధ్య తగ్గుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఒత్తిళ్లు తప్పవు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్ని విధాలా జాగ్రత్తలు పాటించాలి. రిస్క్ కు ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పాటించాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపయోగకరంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. తలనొప్పి, కీళ్లనొప్పులు, రక్తహీనత వంటి వాటిపై జాగ్రత్తలు తీసుకోవాలి. కాంట్రాక్ట్ రంగంవారికి మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మొండిబాకీలు వసూలు చేస్తారు. ముఖ్యమైన పనులపై దృష్టిసారిస్తారు. ప్రయాణాలు ఎక్కువగా చేసే ఉద్యోగంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎంత నిదానంగా ఉంటే అంతమంచిది. కుటుంబ సభ్యులతో చిట్టిపొట్టి తగాదాలు ఏర్పడవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. పనులు వాయిదా పడుతుంటాయి. వ్యాపారస్తులు రొటేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సర్దుబాట్లు విఫలమవుతాయి. కీడెంచి మేలెంచాలన్న చందంగా వ్యవహరిస్తారు. రిస్క్ కి దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. ప్రతి విషయంలో ఎంతోకొంత మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story