Fri Dec 27 2024 10:30:17 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 5 : నేటి పంచాగం, ఈ 5 రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా కలిసివస్తుంది. ఎదుటివారితో మాట్లాడే విషయాల్లో లాభం పొందుతారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, గురువారం
తిథి : శు.చతుర్దశి రా.12.01 వరకు
నక్షత్రం : మృగశిర రా.9.26 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ.10.22 నుండి 11.06 వరకు , మ.2.48 నుండి 3.32 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.50 నుండి 12.35 వరకు, సా.5.00 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. చర్చలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. బరువు, బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రుబలం పెరుగుతుంది. దృష్టిదోషం కూడా పెరుగుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్ట్ రంగాల వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుభవార్తలు వింటారు. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రయాణాలు కలసివస్తాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో వారితో వాగ్వాదం చోటుచేసుకుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలోనూ ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటారో అని ఆలోచిస్తుంటారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఇంటర్వ్యూల్లో మాత్రం విజయం అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా కలిసివస్తుంది. ఎదుటివారితో మాట్లాడే విషయాల్లో లాభం పొందుతారు. ఆర్థిక విషయాలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వైద్య సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల వాతావరణం ఉంటుంది. ఎదుటివారు చెప్పే విషయాలను స్వాగతిస్తారు. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పాత పరిచయాలు మరింత బలపడుతాయి. శుభకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అన్ని విషయాల్లోనూ అనుకూలమైన, ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వాహనాలు నడిపేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ పడితే కానీ.. పనులు సానుకూలపడవు. ఖర్చులు పెరుగుతాయి. క్రయవిక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. పార్ట్ టైం జాబ్స్ చేసేవారికి, ఉద్యోగ ఉన్నతి కోసం ప్రయత్నించేవారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త కోర్సుల్లో చేరే విషయమై నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య తగాదాలు, విభేదాలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. చర్చలు ఫలిస్తాయి. ఎదుటివారితో లౌక్యంగా వ్యవహరిస్తారు. ఇంట్లో ఏర్పడిన చికాకులు సమసిపోతాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఒడిదుడుకులు తగ్గుతాయి. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి విషయంలో నిదానమే ప్రధానంగా వ్యవహరించడం మంచిది. ఒకటికి రెండింతలు ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలో జాప్యం పెరుగుతుంది. అంచనాలు తారుమారవుతాయి. అయినవారు అర్థం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇరుగుపొరుగు వారితో గొడవలు కావొచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story