Fri Dec 27 2024 10:42:48 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 6 : నేటి పంచాగం, ఈ రాశులవారు శుభవార్తలు వింటారు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఇచ్చిన రుణాలను వసూలు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, శుక్రవారం
తిథి : పూర్ణిమ తె.4.37 వరకు
నక్షత్రం : ఆరుద్ర రా.12.14 వరకు
వర్జ్యం : ఉ.6.49 నుండి 8.36 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.54 నుండి 9.38 వరకు , మ.12.35 నుండి 1.20 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.2.00 నుండి 2.35 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వివాదాస్పదమైన అంశాలను పరిష్కరించుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి. వివాదాస్పదమైన అంశాలకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. టీనేజర్లు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. నూతన ఉద్యోగ వ్యవహారాలపై దృష్టిసారిస్తారు. మిమ్మల్ని మీరు నిర్దోషిగా నిరూపించుకునే ప్రయత్నం కలసివస్తుంది. సంతానం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృథా ఖర్చులను తగ్గించడంలో విఫలమవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ప్రతి విషయాన్ని నిదానమే ప్రధానంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. శ్రమపడితే కానీ పనులు సానుకూల పడవు. రిజిస్ట్రేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా శారీరకంగా అలసట పెరుగుతుంది. దంపతుల మధ్య తగాదాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. క్రయవిక్రయాలు కలసివస్తాయి. శుభవార్తలు వింటారు. మంచి వైద్యం అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. వీలైన సలహాలు, సూచనలు అందిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల పరంగా సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరంజ్ కలర్.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. పనులు వాయిదా పడుతుంటాయి. ఫైనాన్స్ రంగాలవారు జాగ్రత్తగా ఉండాలి. పనులపై దృష్టి తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తప్పనిసరి పనులు మినహా.. మిగతా పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఇచ్చిన రుణాలను వసూలు చేసుకునేందుకు కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటారు. వాయిదా పడుతున్న పనుల వల్ల విసుగు చెందుతారు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనిని ప్రణాళిక బద్దంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారు మెచ్చుకునేలా ప్రవర్తిస్తారు. ప్రతి విషయంలో మేలు కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రయాణాలు కలసివస్తాయి. చర్చలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. కొత్తపరిచయాలు ఏర్పడుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రేమలను అంగీకరించే అవకాశాలున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. దగ్గరైనవారే అపార్థాలు చేసుకునే సూచనలున్నాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. లేనిపోని నిందలు పడాల్సి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు సానుకూలంగా ఉంటాయి. కీలక విషయాల విషయంలో సలహాలు సూచనలు పాటించడం మంచిది. పనులను వాయిదా వేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story