Mon Dec 23 2024 02:39:16 GMT+0000 (Coordinated Universal Time)
January 8th to 14 Horoscope : ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి
పిత్రార్జితం లేదా భూముల క్రయవిక్రయాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నూతన పరిచయాలు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, పుష్య మాసం, ఆదివారం
తిథి : బ.పాడ్యమి ఉ.7.07 వరకు
నక్షత్రం : పుష్యమి తె.6.05 వరకు
వర్జ్యం : మ.12.07 నుండి 1.55 వరకు
దుర్ముహూర్తం : సా.4.18 నుండి 5.02 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.9.00 నుండి 9.45 వరకు, మ.3.00 నుండి 3.40 వరకు
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
వృషభం - కుజుడు
తుల - కేతువు
ధనస్సు - రవి, బుధుడు
ధనస్సు - బుధుడు, శుక్రుడు
మకరం - శుక్రుడు, శని
మీనం -గురువు
చంద్రగ్రహ సంచారం
కర్కాటకం, సింహం, కన్య
జనవరి 8 నుండి 14 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నీలాపనిందలు, అపవాదులు చోటుచేసుకుంటాయి. సహకరించే వర్గం తక్కువగా ఉంటారు. శరీరం అలసిపోతుంది. ప్రతి పనిని స్వయంగా చేసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతాయి. పొదుపు విషయాల్లో అవాంతరాలు ఏర్పడుతాయి. ఈ వారం శుక్ర, శనివారాలు మాత్రమే కాస్త అనుకూలంగా ఉంటాయి..
పరిహారం - ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడంతో పాటు నవగ్రహాలను పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అప్పులు ఇవ్వడం, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బాధ్యతలు బరువుగా అనిపిస్తాయి. వ్యసనాల వల్ల నష్టపోతారు. సంఘంలో ఉన్న గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి ఆటంకాలు తొలగిపోతాయి. పనులకు ప్లాన్ చేస్తారు కానీ.. పూర్తికావు. ఈ వారం ఆది, సోమ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : శ్రీరామ రక్షాస్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం విచిత్రంగా సాగుతుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు పెద్దగా ఉండవు కానీ.. అది సంపాదన వల్ల మాత్రం కాదు. అప్పులు చేస్తారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మిషనరీ రంగాల్లో ఉన్న ఉద్యోగులు, వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానిలో కొత్త మార్గాలు లభిస్తాయి. రిస్క్ చేసేందుకు ఇష్టపడరు. ఈ వారం మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని వీలైనన్నిసార్లు పారాయణ చేయడం మంచిది.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఖర్చులు ఉన్నా.. సంపాదన కూడా అదేస్థాయిలో ఉంటుంది. పిత్రార్జితం లేదా భూముల క్రయవిక్రయాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదం కావొచ్చు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్న నిందలు మీపై పడొచ్చు. ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు కలసివస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం మంచిది.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతి పనీ.. ఇక నా వల్ల కాదు అని వదిలేసే సమయంలో పూర్తవుతుంది. పనుల జాప్యంతో నిరాశ చెందుతారు. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. డబ్బు అవసరమైనంత మేరకే లభిస్తుంది. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. బంధువర్గంతో విభేదాలు రావొచ్చు. ప్రయాణాలు లాభం చేకూరుస్తాయి. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వారం మంగళ, బుధవారాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి.
పరిహారం : శ్రీరామ రక్షాస్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. ఆర్థిక విషయాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం నలతగా ఉంటుంది. వాహన యోగం ఉంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. కొత్తకోర్సులు చేసే విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. మాట పడినా నష్టపోకూడదని భావిస్తారు. కుటుంబ శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూలమైన ఫలితాలుంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా డెవలప్ మెంట్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. కొనుగోళ్లు సానుకూలంగా సాగుతాయి. ఎమోషన్స్ ను పక్కనపెడితే.. ఇబ్బందులు పెద్దగా ఉండవు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ప్రతివిషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటుతనం పనికిరాదు. అనుభవజ్నుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. మీ అభిప్రాయానికి దగ్గరగా ఉన్నవారి సలహాలను పాటిస్తారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకపోవడం మంచిది. కుటుంబసభ్యులకు ప్రాధాన్యతనిస్తారు. ఈ వారం బుధ,గురు,శుక్ర,శని వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా.. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేసుకుంటారు. లౌక్యాన్ని కలిగి ఉంటారు. ఏ సమస్య వచ్చినా మానసిక ధైర్యంతో ముందుకి సాగిపోతారు. రిజిస్ట్రేషన్ల విషయాలు సానుకూలంగా సాగుతాయి. క్రయవిక్రయాల్లో నష్టాలు ఉండవు. రాజకీయ రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ ల కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. రహస్యాలను దాచుకోవడం, గ్రూపు రాజకీయాలు చేస్తున్నారన్న అపవాదులు ఎదురవుతాయి. నేను, నా జీవిత భాగస్వామి అన్నట్టుగా మెలగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. క్రీడారంగంలో వారికి, వ్యాయామాలు చేసేవారికి ఇబ్బందులు తలెత్తే సంకేతాలున్నాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ వారం ఆది, సోమ వారాలు అనుకూలంగా ఉంటాయి. సుదర్శన కవచ స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులన అధిగమిస్తారు. వ్యాపారస్తులకు రొటేషన్లు సానుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో చర్చలు ఫలిస్తాయి. బంధువులకు దూరంగా ఉంటారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూలమైన ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగాలపై దృష్టి సారిస్తారు. అప్పులు త్వరగా తీర్చే ప్రయత్నాలు చేస్తారు. సొంతింటి ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టుకేసులు అనుకూలంగా ఉంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. ఈ వారం ఆది, సోమవారాలు మినహా అన్ని రోజులూ అనుకూలమైన ఫలితాలుంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story