Sun Dec 22 2024 16:49:31 GMT+0000 (Coordinated Universal Time)
JULY 10 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ. అనవసరమైన..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, సోమవారం
తిథి : బ.అష్టమి సా.6.48 వరకు
నక్షత్రం : రేవతి రా.7.03 వరకు
వర్జ్యం : ఉ.7.18 నుండి 8.52 వరకు
దుర్ముహూర్తం : మ.12.47 నుండి 1.39 వరకు, ప.3.23 నుండి 4.15 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 5.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీకు సంబంధం లేని పనులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు కలసివస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. తగాదా పడితే మేలు జరిగే వాటిపై దృష్టిసారిస్తారు. అనారోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఆలోచనలు చేస్తారు. ఎదుటివారిని అంచనా వేస్తారు. మొండి పనులపై దృష్టిసారిస్తారు. తగాదాలకు దూరంగా ఉండాలనుకుంటారు. వాయిదా వేసిన ప్రయాణాలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఊరట లభిస్తుంది. ఖర్చులున్నా ఉపయోగపడేవే ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. శారీరకంగా, మాసికంగా అలసిపోతారు. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకూలం. క్రయవిక్రయాలు కలసివస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నవి ఎదుటివారికి చెప్పడానికి మంచి సమయం. కుటుంబ కలహాలు తొలగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వర్క్ పై దృష్టి పెడతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. భాషపై పట్టు సాధించాలన్న ప్రయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ. అనవసరమైన తగాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఓర్పుగా ప్రతి పనిని సాధించుకోవాలి. మొండి పట్టుదలకుపోతే చికాకు పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు, ముఖ్యమైన పనుల్లో, ఎదుటివారిని అంచనా వేయడంలో వైఫల్యాలే ఎక్కువగా ఉంటాయి. మీ పనేదో మీరు చూసుకోవడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. కొత్త విషయాల జోలికి పోకుండా..పాత విషయాలతో అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలున్నా ఊరట లభిస్తుంది. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. సౌకర్యాలను అమర్చుకుంటారు. మార్కెటింగ్ రంగంలో వారికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. రహస్య శత్రువుల బెడద ఎక్కువవుతుంది. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులకు పనివేళలు పెరుగుతుంది. సమస్య తీరాక సమస్య వస్తుంది. ఈ రోజంతా ఏదొక డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నింటా అనుకూలం. మానసికప్రశాంతత ఉంటుంది. రకరకాల ఆలోచనలు చేస్తారు. ఏదొక నిర్ణయానికి వస్తారు. విహార యాత్రలు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య తగాదాలు పోతాయి. ఉద్యోగ, వ్యాపారాలు ఆడుతూ పాడుతూ చేస్తారు. ఆదాయాన్ని పెంచుకునేమార్గాలపై ఆలోచనలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story