Sun Dec 22 2024 16:21:30 GMT+0000 (Coordinated Universal Time)
JULY 12 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ఆచితూచి అడుగులు వేయాలి. వ్యాపారస్తులు..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బుధవారం
తిథి : బ.దశమి సా.6.03 వరకు
నక్షత్రం : భరణి రా.7.46 వరకు
వర్జ్యం : తె.4.59 నుండి 6.37 వరకు
దుర్ముహూర్తం : ఉ.11.55 నుండి 12.47 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచి పరిచయాలు ఏర్పడుతాయి. తగాదా పడైనా మీకు కావలసింది సాధించుకుంటారు. బ్యాంకింగ్ రంగంలో వారికి మంచికాలం. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలకు ఏర్పడే ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారాలు అందివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. తగాదాలు ఎక్కువగా, అర్థం చేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఎదుటివారు మీ సహాయం పొందుతారు కానీ.. మీకు సహాయపడరు. అనుకున్నది సాధించడం కష్టంగా ఉంటుంది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే అవకాశాలు కలసివస్తాయి. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాసాలు, వినోద కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని సౌకర్యాలున్నా ఏదో తెలియని మానసిక అలజడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉండవు కానీ.. వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి. సామాజిక సేవపై దృష్టిసారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధర్మం, న్యాయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘ గౌరవం ఉంటుంది. సంతకానికి విలువున్న ఉద్యోగాల్లో వారికి అనుకూలం. క్రిమినల్ లాయర్లు, వస్తు వ్యాపారస్తులకు లాభాలుంటాయి. జీవిత భాగస్వామితో తగాదాలు రావొచ్చు. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ఆచితూచి అడుగులు వేయాలి. వ్యాపారస్తులు పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండాలి. మంచికిపోయి ఎదుటివారికి సహాయం చేస్తే.. పాముకి పాలు పోసినట్టే. అప్పులు ఇవ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండాలి. వీలైనంత వరకూ రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏ నిర్ణయాలు తీసుకున్నా వెంటనే ఆచరణలో పెడతారు. ఉద్యోగులకు రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. ఆపరేషన్ల విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటారు. అన్నిరకాలుగా ఈ రోజు పెద్దగా ఒడిదుడుకులు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల పరిస్థితులు ఉంటాయి. పూర్తి కాని పనులపై దృష్టిసారించేందుకు, డాక్యుమెంటేషన్లపై, లోన్ల ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. శత్రువులెవరో, మిత్రులెవరో కనిపెట్టడం కష్టం. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉన్నవారితో తగాదాలు ఎక్కువగా ఉండొచ్చు. ప్రయాణాలపై అశ్రద్ధగా పనికిరాదు. ఎక్కువగా స్వయంకృతాపరాధాలు చోటుచేసుకుంటాయి. పనుల్లో ఎదుటివారిపై ఆధారపడొద్దు. ఎవరికీ అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. మీ పని చేసుకోవడంపైనే దృష్టి సారించాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి. కాళ్లనొప్పులు, నడుంనొప్పి బాధించవచ్చు. బద్ధకం కూడా ఇబ్బంది పెడుతుంది. పనులు వాయిదా పడొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దస్తావీజులకు సంబంధించిన అంశాలు కలసివస్తాయి. ఉద్యోగులకు అనుకూలం. దంపతుల మధ్య తగాదాలు సహజం. ఒకరి గురించి ఒకరు కొత్తవిషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు భాషపై పట్టుసాధించే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చేటుచేసుకుంటాయి. అలసట పెరుగుతుంది. ఒత్తిడులు అధికమవుతాయి. పనివేళలు పెరుగుతాయి. తెలియని ఆలోచనలో ఉంటాయి. ప్రయాణాలు మరింత శ్రమను పెంచుతాయి. చికాకు పెరుగుతుంది. మనసులో భావాలు ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
Next Story