Fri Jan 03 2025 03:27:21 GMT+0000 (Coordinated Universal Time)
JULY 13 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎంత తక్కువగా మాట్లాడితే అంతమంచిది. ఎదుటివారి మాటల్ని పట్టించుకోకపోవడం
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, గురువారం
తిథి : బ.ఏకాదశి సా.6.28 వరకు
నక్షత్రం : కృత్తిక రా.8.54 వరకు
వర్జ్యం : ఉ.8.20 నుండి 10.00 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.12 నుండి 11.04 వరకు, మ.3.23 నుండి 4.15 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : సా.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 5.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనివేళలు పెరుగుతాయి. చిరువ్యాపారస్తులకు అనుకూలం. విద్యార్థులకు బాగుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచి ఆలోచనలు చేస్తారు. అందంపై మమకారం పెరుగుతుంది. ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. చిన్న ఒత్తిడులున్నా అధిగమిస్తారు. స్థిర చరాస్తుల నిర్మయాలకు అనుకూలం కాదు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన శ్రమ ఉంటుంది. అనవసరమైన విషయాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. లాభ నష్టాలుండవు. కాంట్రాక్ట్ రంగంలో వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. స్వయంకృతాపరాధం చోటుచేసుకుంటే తప్ప ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఇబ్బందులుండవు. వ్యాపారస్తులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా వెసులుబాటు ఉంటుంది. ఇబ్బంది పెట్టేవారిని కనిపెడతారు. న్యాయపరమైన అంశాలు కలసివస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని చూస్తేనే కోపగించుకునేవారు ఈరోజు మాట్లాడుతారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా ఊరటగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎంత తక్కువగా మాట్లాడితే అంతమంచిది. ఎదుటివారి మాటల్ని పట్టించుకోకపోవడం మంచిది. రిస్క్ కు దూరంగా ఉండాలి. వీలైనంత వరకూ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. కొనుగోళ్లు, క్రయవిక్రయాలకు, చర్చలకు, పరిచయాలను పెంచుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అజీర్తి వంటి సమస్యలు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఎదుటివారితో మాట్లాడేటపుడు లౌక్యంగా ఉంటారు. సేవింగ్స్ పై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలకు దూరంగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగులకు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. కోపం, ఆవేశం తగ్గించుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ప్రాధాన్యత సంతరించుకుంటాయి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కోరుకున్న వస్తుసామాగ్రిని అమర్చుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story