Sun Dec 22 2024 11:44:40 GMT+0000 (Coordinated Universal Time)
JULY 19 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు లోటుండదు. ఆర్థికంగా వెసులుబాటు..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, బుధవారం
తిథి : శు. విదియ తె.4.30 వరకు
నక్షత్రం : పుష్యమి ఉ.7.57 వరకు
వర్జ్యం : రా.10.20 నుండి 12.07 వరకు
దుర్ముహూర్తం : ఉ.11.56 నుండి 12.48 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : సా.4.00 నుండి 4.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు వాయిదా పడొచ్చు. ఎదుటివారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నిరకాల సౌకర్యాలను సమకూర్చుకుంటారు. తెలివితేటలు పుష్కలంగా పనిచేస్తాయి. ఎదుటివారి నుంచి ఆశించే సహాయ సహకారాలు అందుకుంటారు. చర్చలు విజయవంతమవుతాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు మెరున్ కలర్.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక, మానసిక అలసట పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కీడెంచి మేలెంచాలన్న విధంగా ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రయాణాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయరంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువగా, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. విపరీతమైన బాధకు గురయ్యే అవకాశాలున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలు నేర్పుగా చేసుకుంటారు. ఉద్యోగులకు మెరుగైన కాలం. వ్యాపారస్తులకు అనుకూలం. ఇంచుమించుగా అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు లోటుండదు. ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాస్త వెసులుబాటు ఉంటుంది. ఖర్చులు ఉపయోగకరంగా ఉంటుంది. శత్రువులెవరో, మిత్రులెవరో తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్లలో తొందరపాటుతనం పనికిరాదు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. పనులు నత్తనడకన సాగుతాయి. ఎదుటివారు చెప్పిన మాటలతో ఆవేశానికి లోనవుతారు. నష్టాలున్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. పార్ట్ టైమ్ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. కొత్తవిషయాలు తెలుసుకుంటారు. మొండితనం ఉన్నా..ఇబ్బందులుండవు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెండింగ్ బిల్స్ వసూళ్ల ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్ట్ రంగంవారికి యోగదాయకంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలోనూ తగాదాలు ఎదురవుతాయి. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు ఉండవు. విద్యార్థులు అధిక శ్రద్ధ తీసుకోవాలి. అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులను కనిపెట్టడంలో వైఫల్యం చెందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story