Sun Dec 22 2024 11:34:56 GMT+0000 (Coordinated Universal Time)
JULY 20 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాతి నుంచి అనుకూలం. ఎదుటివారి నుంచి కావాలనుకున్న..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, గురువారం
తిథి : శు. తదియ పూర్తిగా..
నక్షత్రం : ఆశ్లేష ఉ.10.54 వరకు
వర్జ్యం : రా.12.25 నుండి 2.14 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.13 నుండి 11.05 వరకు, మ.3.23 నుండి 4.15 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు రిస్క్ కు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రోజంతా చికాకుగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒడిదుడుకులుగా ఉంటుంది. అవునంటే తగాదా, కాదంటే తగాదాగా ఉంటుంది. అప్పుచేసి మరో అప్పు తీర్చాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11 గంటల వరకే అనుకూలం. ముఖ్యమైన పనులు ఆ లోగా పూర్తిచేసుకోవాలి. 11 గంటల తర్వాత ఖర్చులు పెరుగుతాయి. పనులు వాయిదా పడుతుంటాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11 గంటల వరకూ అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. 11 గంటల తర్వాతి నుంచి వృథాఖర్చులు పెరుగుతాయి. మాటకు పెడార్థాలు తీసేవారి సంఖ్య పెరుగుతుంది. శారీరక, మానసిక అలసట పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దూరప్రాంత ప్రయాణాలకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11 గంటల వరకే అనుకూలం. ఆ తర్వాత అనవసరమైన ప్రయాణాలుంటాయి. ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మంచితనాన్ని గుర్తించరు. ఆర్థిక స్థితిగతులు సమానంగా ఉంటాయి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచి ఆహారం లభిస్తుంది. విశ్రాంతి తీసుకుంటారు. ప్రశాంతంగా ఉంటారు. ప్రేమలు ఫలిస్తాయి. బాధ్యతల పట్ల జాగ్రత్తగా ఉంటారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో మెరుగైన స్థితి ఉంటుంది. వాహన యోగం ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాతి నుంచి అనుకూలం. ఎదుటివారి నుంచి కావాలనుకున్న సహాయ సహకారాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల పరంగా అధికారులతో జరిపే సంప్రదింపులు సక్సెస్ అవుతాయి. ఆరోగ్యపరమైన ఊరట లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11 గంటల వరకూ పూర్తి వ్యతిరేకం. ఆ తర్వాత ఆర్థిక సర్దుబాట్లకు అనుకూలం. నిదానంగా ఆలోచిస్తారు. ప్రయాణాల్లో లాభనష్టాలుండవు. భారీ వ్యాపారాలు చేసేవారికి మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11 గంటల వరకే అనుకూలం. తర్వాత కీడెంచి మేలెంచాలన్న ఆలోచనలు పెరుగుతాయి. అందరూ బాగున్నారు కానీ నేనే బాలేను అనే ఆలోచనలు బలపడతాయి. ఉద్యోగులు ఏ విషయాలను పంచుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటుంది. ఊరటగా కొనసాగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రోజంతా అంచనాల మేరకు కొనసాగుతుంది. అప్పు చేయాలనుకునేవారికి రుణం లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత అనుకూలం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరమైన విషయాలపై దృష్టిసారిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగిస్తారు. ప్రయాణాలు సౌకర్యంగా ఉంటాయి. గౌరవ, మర్యాదలు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగులు లేత రంగులు.
Next Story