Sun Dec 22 2024 11:44:56 GMT+0000 (Coordinated Universal Time)
JULY 24 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. శ్రమ ఎక్కువ, ఫలితాలు..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, సోమవారం
తిథి : శు.షష్ఠి మ.1.39 వరకు
నక్షత్రం : హస్త రా.10.08 వరకు
వర్జ్యం : ఉ.6.44 వరకు
దుర్ముహూర్తం : మ.12.48 నుండి 1.39 వరకు, మ.3.22 నుండి 4.14 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు మంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. ఆర్థికపరమైన వెసులుబాటు లభిస్తుంది. గడిచిన 4 రోజులకంటే ఈ రోజు ఉల్లాసంగా, హాయిగా కొనసాగుతుంది. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక సమీకరణాలతో పాటు పరిచయాల వృద్ధికోసం చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు, వివాదాలు అనవసరమైన ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా కొనసాగుతాయి. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. చేయాలనుకున్న పని పూర్తికాదు. రోజంతా మొక్కుబడిగా ఉంటుంది. శారీరక, మానసిక అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్, క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా సాగుతాయి. అపార్థం చేసుకున్నవారి వద్దకు వెళ్లి నిజాలు తెలియజేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఊరటనిచ్చే ఫలితాలుంటాయి. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి రెండు రూపాయలు ఖర్చవుతాయి. అనవసరమైన వాగ్వాదాలకు ప్రాధాన్యమివ్వకుండా జాగ్రత్తపడాలి. దృష్టిదోషం పెరుగుతుంది. శత్రువులెవరో, మిత్రులెవరో కనిపెట్టడం కష్టతరంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తెలియని ప్రశాంతత ఏర్పడుతుంది. పనిని కాన్ఫిడెంట్ గా పూర్తిచేస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఎదుటివారిని అంచనా వేయగలుగుతారు. గౌరవ, మర్యాదలకు లోటుండదు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఊహించని ఖర్చులుంటాయి. అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా ఒత్తిడులు అధికమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చేపట్టిన పని సకాలంలో పూర్తవుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఆర్థికపరమైన ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సమీకరణాలు సానుకూలంగా ఉంటాయి.తగాదాలు, విభేదాలు ఒడిదుడుకులు కలుగజేస్తాయి. నష్టాలుండవు. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. కొత్తకోర్సులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడులు ఎక్కువగా ఉన్నా.. నేర్పుగా వాటి నుంచి బయటపడుతారు. ఎదుటివారితో నిదానంగా మాట్లాడుతారు. పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఎదుటివారిని అంచనా వేస్తారు. వాహనసౌఖ్యం ఉంది. మంచి నిద్రాహారాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వీలైనంత వరకూ మీ పని మీరు చూసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. బద్ధకం పెరుగుతుంది. అన్నీ నాకు తెలుసన్న ధోరణి మంచిదికాదు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. మంచి ధైర్య, సాహసాలు కనబరుస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆదరాభిమానాలను కలిగి ఉంటారు. ఆర్థిక పరిణామాలు ఊరటనిస్తాయి. మనశ్శాంతిని కలిగి ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
Next Story