Sun Dec 22 2024 11:51:26 GMT+0000 (Coordinated Universal Time)
JULY 25 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11.30 తర్వాతి నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, మంగళవారం
తిథి : శు.సప్తమి మ.3.03 వరకు
నక్షత్రం : చిత్త రా.11.59 వరకు
వర్జ్యం : ఉ.6.45 నుండి 8.28 వరకు, తె.5.50 నుండి 7.31 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.29 నుండి 9.21 వరకు, రా.11.16 నుండి 12.00 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.00 నుండి 12.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సంఘ గౌరవం పెరుగుతుంది. క్రయవిక్రయాలకు సానుకూలం. రిజిస్ట్రేషన్లు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పనుల్లో కదలికలు ఏర్పడుతాయి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఖర్చులెక్కువగా ఉంటాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉండొచ్చు. పనులు వాయిదా పడొచ్చు. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 11.30 గంటల వరకు మాత్రమే అనుకూలం. చర్చలకు, ఆర్థికపరమైన విషయాలకు, ఎదుటివారి నుంచి మాట తీసుకునేందుకు 11.30 వరకే అనుకూలంగా ఉంటుంది. తర్వాతి నుంచి ఊహించని ఖర్చులుంటాయి. అనుకున్నదానికంటే కాలం వ్యతిరేకంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అనుకూలం. వృథాఖర్చులు, చికాకులతో ప్రారంభమై చాలా ఉత్సాహంగా పూర్తవుతుంది. ఉద్యోగస్తులకు సాటి ఉద్యోగులతో ఏర్పడే విభేదాలు పరిష్కారమవుతాయి. ముక్కుసూటిగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11.30 గంటల వరకే అనుకూలం. ఆ తర్వాతి నుంచి ఖర్చులు పెరుగుతాయి. ఇబ్బందికరమైన అంశాలు, పరిచయం లేని వాటిపై దృష్టిపెట్టేందుకు అనుకూలం కాదు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11.30 తర్వాతి నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. క్రయవిక్రయాల్లో క్లారిటీ వస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11.30 తర్వాత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఊహించని ప్రయాణాలుంటాయి. తగాదాలు చోటుచేసుకుంటాయి. విలువైన వస్తువులు కనిపించక కంగారుపడతారు. పరిచయాలను పెంచుకునే ప్రయత్నాలు బెడిసికొడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకూలం. దంపతుల మధ్య తగాదాలు, విభేదాలకు విరామం లభిస్తుంది. స్థిరచరాస్తులపై దృష్టి సారించేందుకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనారోగ్యానికి మంచి వైద్యం అందుతుంది. ప్రతి విషయంలో ఎంతోకొంత మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11.30 గంటల నుంచి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అవమాన పడతారని భావించిన చోట మేలు జరగవచ్చు. కొత్తగా కెరియర్ ను ఆరంభించేవారికి ఊరటనిచ్చే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రయాణాలు సానుకూలమవుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం 11.30 గంటల వరకు మాత్రమే సహకరిస్తుంది. ఆ తర్వాత నుంచి ఊహించని ఖర్చులు, పరిణామాలుంటాయి. తలనొప్పి బాధిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story