Sun Dec 22 2024 11:28:07 GMT+0000 (Coordinated Universal Time)
JULY 26 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన శ్రమ పెరుగుతుంది. మానసిక ఆందోళన..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, బుధవారం
తిథి : శు.అష్టమి మ.3.46 వరకు
నక్షత్రం : స్వాతి రా.1.06 వరకు
వర్జ్యం : ఉ. 7.31 వరకు
దుర్ముహూర్తం : ఉ.11.57 నుండి 12.48 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.11.00 నుండి 11.50 వరకు, సా.5.00 నుండి 5.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ కు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కీలక నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఉచిత సలహాలు ఇవ్వడం, తీసుకోవడం కూడా మంచిది కాదు. విద్యార్థులు అధికంగా శ్రద్ధగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు, నూతన నిర్ణయాలకు, రిజిస్ట్రేషన్లకు, బ్యాంక్ రుణాలకు, ఇంటర్వ్యూలకు, న్యాయపరమైన అంశాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లకు, ఇష్టంలేనివారిని దూరంగా ఉంచేందుకు సానుకూలం. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఇష్టమైన ఆహారం స్వీకరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే నిర్ణయాలు యోగదాయకంగా ఉండవు. అనుక్షవజ్ఞుల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ఖర్చులు పెరుగుతాయి. ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కీలక విషయాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలం. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. కీలక పనుల్లో కదలికలు వస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. ఏం మాట్లాడినా తగాదాగానే ఉండే అవకాశాలు ఎక్కువ. అనుకునేది ఒకటి జరిగేది మరొకటిగా ఉంటుంది. అంచనాలను అందుకోలేరు. వీలైనంత వరకూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. వ్యాపారస్తులకు రొటేషన్లు బాగుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నేవీ బ్లూ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన శ్రమ పెరుగుతుంది. మానసిక ఆందోళన అధికమవుతుంది. ఇంట, బయట తగాదాలు, వివాదాలతో ఒత్తిడి పెరుగుతుంది. ఉచిత సలహాలు ఇవ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ఇష్టమైన వ్యక్తులతో కాలక్షేపం చేస్తారు. అప్పులు తీరుస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు హడావిడిగా ఉంటుంది. అందుకు తగిన ఫలితాలు అందుతాయి. తగాదాలు మేలు చేస్తాయి. ఖర్చులు ఉన్నా.. ఉపకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానంగా ఉంటారు. ఆర్థిక విషయాలపై దృష్టిసారిస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
Next Story