Sun Dec 22 2024 11:48:38 GMT+0000 (Coordinated Universal Time)
JULY 29 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఊహించని ఖర్చులుంటాయి. శ్రమ పెరుగుతుంది. ఫలితం తక్కువగా ఉంటుంది.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, శనివారం
తిథి : శు.ఏకాదశి మ.12.59 వరకు
నక్షత్రం : జ్యేష్ఠ రా.11.29 వరకు
వర్జ్యం : ఉ.6.07 నుండి 7.38 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.58 నుండి 7.41 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఎదుటివారికి మంచి చెప్పినా అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరు అపార్థం చేసుకున్నా మీకే ఇబ్బందిగా ఉంటుంది. ఆర్థికంగా నిరుత్సాహం, వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు ఉన్నా ఉపయోగకరమైనవే ఉంటాయి. ఎదుటివారితో ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. రిజిస్ట్రేషన్లు సజావుగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. మంచి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానంగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఎవరిపైనా ఆధారపడొద్దు. ఒకే సమయంలో అనేక పనులు చేయాల్సి ఉండటంతో ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. బద్ధకం పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. మనసొకచోట మనిషొక చోట అన్నట్టుగా ఉంటారు. అనవసరమైన తగాదాలు, ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచి సౌకర్యాలు, గౌరవ మర్యాదలు ఏర్పడుతాయి. ఎదుటివారితో చెప్పాలనుకున్నది చెప్తారు. ఆఫర్ లెటర్లు అందుతాయి. విలువైన సామాన్లను కొనుగోలు చేస్తారు. రోజంతా మంచిగానే సాగుతుంది. ముక్కుసూటి తనాన్ని తగ్గించుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఊహించని ఖర్చులుంటాయి. శ్రమ పెరుగుతుంది. ఫలితం తక్కువగా ఉంటుంది. ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. సంతకానికి విలువ ఉన్న ఉద్యోగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనువైన రోజు కాదు. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు. ఉద్యోగులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనసుకు నచ్చిన విషయాలను తెలుసుకుంటారు. భాషపై పట్టు సాధించే, రహస్య శత్రువులను కనిపెట్టే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు, వాహన కొనుగోళ్లు ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ పెరుగుతుంది. ఎదుటివారు మాట్లాడే విషయాల్లో నిజానిజాలు తెలుసుకోవడంలో వైఫల్యం చెందుతారు. విద్యార్థులకు అనుకూలం. వ్యాపారస్తులకు రొటేషన్లకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మాటతీరులో జాగ్రత్తగా ఉంటే చాలు. పొరపాటున మాటజారితే.. అదే స్వయంకృతాపరాధమవుతుంది. మొండి బాకీల వసూళ్లకు, పెండింగ్ పనులు, లోన్ల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక అంశాలకు అనుకూలం. చిన్న తగాదాల్లో మీదే పైచేయి అవుతుంది. ప్రయాణాలపై దృష్టిసారిస్తారు. భవిష్యత్ దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులు, ఉద్యోగులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్నట్టుగా ఉంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా ఆచితూచి వ్యవహరిస్తారు. మధురమైన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటారు. హాబీస్ పై దృష్టిసారిస్తారు. తెలియని నిరుత్సాహం మాత్రం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story