Sun Dec 22 2024 16:28:59 GMT+0000 (Coordinated Universal Time)
JULY 5 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. చిక్కుముడులు వీడతాయి.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బుధవారం
తిథి : బ.విదియ ప.10.02 వరకు
నక్షత్రం : శ్రవణం రా.2.56 వరకు
వర్జ్యం : ఉ.9.11 నుండి 10.37 వరకు
దుర్ముహూర్తం : ఉ.11.53 నుండి 12.45 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.11.00 నుండి 11.40 వరకు, మ.3.55 నుండి 4.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఎదుటివారితో లౌక్యంగా వ్యవహరిస్తారు. ఆటంకం వచ్చే విషయాలపై ఆలోచిస్తే మంచి పరిష్కారం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారస్తులకు అనుకూలం. మీపై జరిగే అసత్య ప్రచారానికి తెరపడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఎదుటివారు మిమ్మల్ని ఉపయోగించుకుని లాభపడతారు. సంఘ గౌరవాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడిని అధిగమిస్తారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో నిరుత్సాహం తప్పదు. వృథా ఖర్చులు చోటుచేసుకుంటాయి. ఎదుటివారిని నమ్మితే ఒక తంట, నమ్మకపోతే మరో తంటాగా ఉంటుంది. అహంభావులన్న ముద్ర పడుతుంది. ప్రయాణాలకు దూరంగా ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. శుభకార్యాలపై దృష్టిసారిస్తారు. మనసుకి ఊరటనిచ్చే వినోద కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. పాతపరిచయాలతో పాటు కొత్త పరిచయాలను బలపరుచుకునే ప్రయత్నాలు చేస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇష్టమైన ఆహారాలను స్వీకరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తగ్గుతాయి. న్యాయపరమైన ఫిర్యాదులు చేసేందుకు మంచి సమయం. విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వీలైనంత వరకూ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశాలెక్కువ. ఇంట్లో గొడవలు చికాకు తెప్పిస్తాయి. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అప్పులు చేయడం మంచిది కాదు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడతాయి. బద్ధకం పెరుగుతుంది. వృధాఖర్చులు చోటుచేసుకుంటాయి. ప్రతి పనినీ యాంత్రికంగా చేస్తారు. విద్యార్థులకు శ్రద్ధ తగ్గుతుంది. పనులను వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. చిక్కుముడులు వీడతాయి. క్రీడా, కళాసాహిత్య, వైద్య వృత్తుల్లో ఉండేవారికి వెసులుబాటు ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చుల విషయంలో, మాటతీరులో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఉద్యోగులకు తికమకగా రోజు గడుస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేనినీ పట్టించుకోరు. మీరనుకున్న దానిపైనే దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. స్థిరచరాస్తులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు, వృథా ప్రయాణాలు, వృథా ప్రయాస ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఈ రాశిలో ఉన్న వారందరికీ ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. గాయాలయ్యేందుకు అవకాశాలెక్కువ. తలనొప్పి బాధిస్తుంది. పనులు వాయిదా వేయలేరు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. విద్యార్థులకు కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇచ్చిన రుణాలు వసూలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. శుభకార్యాలపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story