Sun Dec 22 2024 16:46:33 GMT+0000 (Coordinated Universal Time)
WEEKLY HOROSCOPE : నేటి పంచాగం, జులై 9 నుండి జులై15 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సహకరించే గ్రహాల సంఖ్య తక్కువగా ఉంటుంది. పనివేళలు పెరుగుతాయి. వ్యాపారస్తులు..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మఋతువు, ఆషాఢ మాసం, ఆదివారం
తిథి : బ.సప్తమి రా.8.04 వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా.7.33 వరకు
వర్జ్యం : తె.5.59 నుండి 7.20 వరకు
దుర్ముహూర్తం : సా.5.07 నుండి 5.59 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : లేవు
నవగ్రహ సంచారం
మేషం - గురువు, రాహువు
మిథునం - రవి
కర్కాటకం - బుధుడు
సింహం - కుజుడు, శుక్రుడు
తుల - కేతువు
కుంభం - శని
చంద్రగ్రహ సంచారం
మీనం, మేషం, వృషభం
జులై 9 నుండి జులై15 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. క్షణం తీరిక ఉండదు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. ఇష్టంలేని వ్యక్తులకు దూరంగా ఉంటారు. బంధువులు ఏమనుకుంటున్నారు అనే దానికంటే.. మీ ఆలోచనకే విలువనిస్తారు. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానంపరంగా తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సహకరించే గ్రహాల సంఖ్య తక్కువగా ఉంటుంది. పనివేళలు పెరుగుతాయి. వ్యాపారస్తులు రొటేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. మీపై లేనిపోని చెడు ప్రచారం చేస్తారు. ఉద్యోగులు.. ఉద్యోగం మారేందుకు అనుకూలం కాదు. అనుకున్న పనులు అనుకున్నంత వేగంగా జరగవు. ఈ వారం సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పరంగా.. లో ఫీవర్ అధికమవుతుంది. కంటిచూపు సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు వెంటనే వైద్యం తీసుకోవడం మంచిది. బద్ధకం పెరుగుతుంది. తప్పు జరిగితే ఎదుటివారినే వేలెత్తి చూపడం సరికాదు. శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఆధ్యాత్మికంగా మొక్కుల్ని తీరుస్తారు. ఈ వారం ఆది, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రశాంతంగా సాగిపోతుంది. లాభనష్టాలుండవు. పని చేయాలన్న ఉత్సాహం, చేయకూడదన్న నిరుత్సాహం ఉండవు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కొత్త అప్పులు చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలుంటాయి. నూతన వ్యాపారాలు చేయాలనుకునేవారు పునరాలోచించుకోవాలి. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పారాయణం చేయాలి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం శుభగ్రహాలు యోగిస్తుండటంతో.. శుభకార్యాల ప్రయత్నాలు ముడిపడుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శత్రుబలం తగ్గుతుంది. ఆర్థికంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అందుకు తగిన ఆదాయం ఉంటుంది. సేవింగ్స్ సాధ్యం కాదు. దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది. పనుల్లో తగిన సహాయ సహకారాలు లేక చికాకు పడతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఒడిదుడుకులుగా ఉండటం కలవరపెడుతుంది. తగాదాలు, విభేదాలను అధిగమిస్తారు. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం తెలివితేటలతో పదిమంది మెప్పు పొందుతారు. ఎదుటివారికి మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బంగారం తాకట్టు పెట్టే నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఆందోళనగా ఉంటారు. పదునైన వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం, దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రశాంతత లభిస్తుంది. ఎక్కడ ఖర్చుపెట్టాలి, ఎక్కడ సేవింగ్స్ చేయాలి ఆచితూచి చేస్తారు. ఎదుటివారితో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదన్న వివేకంతో ఉంటారు. స్థిరచరాస్తులపై క్లారిటీ వస్తుంది. అన్నదమ్ముల మధ్య తగాదాలు, విభేదాలు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. లోన్ల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక పరంగా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆరోగ్య సూత్రాలపై దృష్టిసారిస్తారు. రహస్య శత్రువులను అదిమిపెడతారు. తొందరపాటుతనం రానివ్వరు. అదను చూసి శత్రువులను దెబ్బకొడతారు. అరుగుదల లోపాలు బాధిస్తాయి. ఈ వారం ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. తప్పు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగం మానేయాలని, బెటర్ జాబ్ వచ్చిందని ఉన్న ఉద్యోగం మానేయడం వంటివి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన తగాదాలకు దూరంగా. మీ కష్టానికి తగ్ిన గుర్తింపు ఉండదు. ఇంట, బయట మీ పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంది. అన్నిరంగాలు, అన్ని వయసుల వారు రిస్క్ కు ఆమడ దూరంగా ఉండాలి. ప్రతి చిన్న విషయంలో ఆచితూచి అడుగు ముందుకువేయాలి. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఊరటనిచ్చే శుభవార్తలు వింటారు. రూపాయి దాయడం కత్తిమీద సాములాగే ఉంటుంది. ఇంట, బయట చికాకులు పెరుగుతాయి. లాయర్, వైద్య, రాజకీయ రంగాల్లోవారికి ఒత్తిడులున్నా నిలదొక్కుకుంటారు. తీసుకునే నిర్ణయాలు అనుభవజ్ఞుల సలహాలు మేరకు తీసుకోవడం మంచిది. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం తగాదా పడితే తప్ప ఏ పని అవ్వదు. ఆఖరికి అప్పులు వసూలు చేయాలన్న తగాదా పడక తప్పని స్థితి. ప్రతి చిన్నదానికి తగాదా అంటే చికాకు పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ప్రతి విషయంలో మార్పులు ఎక్కువ, ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు కాలభైరవ అష్టకాన్ని స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. కానీ.. ఆర్థికంగా పర్మినెంట్ సొల్యూషన్ లభించదు. వయసులో పెద్దవారు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. అవమానాలపాలవుతారు. వ్యవసాయ రంగంవారు తగు జాగ్రత్తలు పాటించాలి. క్షణం తీరిక లేదు. పైసా ఆదాయం లేదన్న విషయం అక్షరాలా సరిపోతుంది. విద్యార్థులు ఎంత చదివినా బుర్రకు ఎక్కదు. మనసొకచోట.. మనిషి మరోచోట ఉంటారు. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రశాంతంగా ముందుకు వెళ్తారు. ఎదుటివారితో మాట్లాడేందుకు, మాట తీసుకునేందుకు, విహార-వినోద కార్యక్రమాలకు, రిజిస్ట్రేషన్లకు, పరిచయాలను పెంచుకునేందుకు అనుకూలం. ఉద్యోగులు తమ పనివేళల వరకే పనిచేస్తామని కరాకండిగా చేస్తారు. ప్రతి విషయంలో నిర్థిష్ట ఆలోచనతో ఉంటారు. పాత, కొత్తపరిచయాలు ఉపయోగపడుతాయి. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story