Mon Dec 23 2024 02:33:03 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 10 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. వృథా ఖర్చులుంటాయి. రుణ ప్రయత్నాల్లో
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శనివారం
తిథి : బ.సప్తమి ప.2.04 వరకు
నక్షత్రం : శతభిషం మ.3.41 వరకు
వర్జ్యం : రా.9.47 నుండి 11.19 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.44 నుండి 7.28 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.40 నుండి 11.40 వరకు, సా.4.45 నుండి 5.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పరిచయాలు విస్తరిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. మంచి వైద్యం పొందుతారు. తీరట్లేదనుకున్న పనులు, సమస్యలపై దృష్టిసారిస్తే సక్సెస్ అవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒడిదుడుకులు, తగాదాలు ఉన్నా మీదే పైచేయిగా కొనసాగుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. అధికారుల మెప్పు పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మీ సలహాలు పాటించిన వారికి అనుకూలం. అవే సలహాలు మీరు పాటిస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు, విహారయాత్రలు, వినోదకార్యక్రమాలు, తినే ఆహారం తృప్తినిస్తాయి. విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్పర విరుద్ధమైన అంశాలు ఎదురవుతాయి. కాదనకుండా పనులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. శత్రుబలం పెరుగుతుంది. నిరుత్సాహం రానివ్వకూడదు. వృథాఖర్చులు పెరుగుతాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. శుభవార్తలు వింటారు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గౌరవ, మర్యాదలు కలిగి ఉంటారు. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారో అంచనా వేసుకుంటారు. కళా,సాహిత్య రంగాల్లో ఉండేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఊహించని ఖర్చులుంటాయి. అనవసరమైన శ్రమ పెరుగుతుంది. ప్రతి చిన్నవిషయాన్ని మనసుకి తీసుకుని బాధపడుతుంటారు. చికాకు, కోపం, ఆందోళన, ఆవేశం, అయోమయం, గందరగోళం.. రోజంతా ఇంచుమించుగా ఇలాగే సాగుతుంది. నన్ను అర్థం చేసుకునేవారెవరూ లేదన్న విధంగా ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. వృథా ఖర్చులుంటాయి. రుణ ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువ. అర్థం చేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రకరకాల ఒత్తిడులకు గురవుతారు. వాహన మరమ్మతులు ఎదురవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎదుటివారికి సలహాలు సూచనలు అందిస్తారు. ప్రతివిషయంలో క్లారిటీగా ఉంటారు. లాభనష్టాలున్నా ముందుకి సాగుతారు. వ్యాపారస్తులకు అనుకూలం. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి. అనవసరమైన వివాదాలు, తగాదాలు ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. చేసేపని నచ్చదు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతివిషయంలో ఆలోచన పెరుగుతుంది. ఏ నిర్ణయాన్ని త్వరగా తీసుకోలేరు. ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులుండవు. శుభసమాచారాలు అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అంచనాలు తారుమారవుతాయి. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు రొటేషన్లు సాధారణంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్లపై దృష్టిసారిస్తారు. తగాదాలు, విబేధాలు మానసిక అప్రశాంతతకు కారణవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story