Mon Dec 23 2024 03:04:41 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 12 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, సోమవారం
తిథి : బ.నవమి ఉ.10.36 వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర మ.1.51 వరకు
వర్జ్యం : రా.1.43 నుండి 3.18 వరకు
దుర్ముహూర్తం : మ.12.42 నుండి 1.34 వరకు, మ.3.18 నుండి 4.10 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.4.00 నుండి 5.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. నమ్మినవారే అందుబాటులో ఉండరు. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. శారీరక అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగప్రయత్నాలకు అనుకూలం. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. సంఘగౌరవాన్ని కలిగి ఉంటారు. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. న్యాయవాద, వైద్య వృత్తులవారికి అనుకూలం. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒడిదుడుకులు, ఒత్తిడులు ఉన్నా అధిగమిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఎదుటివారితో వాదించైనా కావలసిన వాటిని సాధించుకుంటారు. విద్యార్థులకు అనుకూలం. క్రీడారంగంలో వారు అధికజాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు, వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగులు, వ్యాపారులు ఓర్పుతో వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఎదుటివారు అర్థం చేసుకోవట్లేదనుకంటారే గానీ మీ వైపు నుండి వచ్చే తప్పును గుర్తించరు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాగ్వివాదాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. నిదానంగా ఆలోచిస్తారు. నింపాదిగా ముందుకెళ్తారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి. మెరుగైన వైద్యం పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. ఇష్టమైన ఆహారం స్వీకరిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. సమయాన్ని వృథా చేయరు. విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు, వృథా ఖర్చులు పెరుగుతాయి. అనుకున్నదొకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. చికాకు పెరుగుతుంది. విద్యార్థులకు శ్రద్ధ తగ్గుతుంది. పనివేళలు పెరగడంతో శారీరక, మానసిక అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. తప్పు మీది కాకపోయినా మాట పడాల్సి ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. ఊహాగానాలకు దూరంగా ఉండాలి. జీరో రిస్క్ ఉన్న పనులు చేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మాటతీరు పట్ల, ఆర్థిక విషయాలు, కుటుంబ పరమైన విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. నిద్రపట్టక ఇబ్బంది పడతారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉపయోగపడే ఖర్చులుండవు. మాటపట్టింపులు అధికంగా ఉంటాయి. మనసుకు బాధకలిగించే సంఘటనలు ఎదురవుతాయి. శారీరక, మానసిక అలసట పెరుగతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. అప్పులు చేస్తారు. నష్టాలు లేవు కానీ.. చికాకులు పెరుగుతాయి. మానసిక ధైర్యం, స్థైర్యాన్ని కోల్పోకూడదు. ప్రేమలు వివాదాస్పదమవుతాయి. పాతస్నేహాలు, కొత్తపరిచయాలు ఉపకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
Next Story