Sun Dec 22 2024 21:15:05 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 13 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కలసివస్తుంది.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, మంగళవారం
తిథి : బ.దశమి ఉ.9.30 వరకు
నక్షత్రం : రేవతి రా.1.34 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ.8.21 నుండి 9.14 వరకు, రా.11.10 నుండి 11.54 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.00 నుండి 12.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఇవ్వవలసి డబ్బులు వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. రావలసిన బిల్లులు ఆలస్యమవుతాయి. పాతపరిచయాలు ఉపయోగపడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు, భూమికి సంబంధించిన అంశాలు కలసివస్తాయి. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. శుభవార్తలు అందుకుంటారు. పెండింగ్ బిల్లులు రాబట్టుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి. వివాదాలు జరుగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ఇంట, బయట అనేక పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. కొందరిని కావాలనే దూరంగా ఉంచుతారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయవాదులతో సంప్రదింపులు కలసివస్తాయి. మొహమాటం లేకుండా వ్యవహరిస్తారు. అంత్యనిష్టూరం కన్నా ఆదినిష్టూరం మేలన్నట్టుగా వ్యవహరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తప్పొప్పులు ఎలా ఉన్నా ఇబ్బంది పడతారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కలసివస్తుంది. అర్థవంతమైన ఖర్చులుంటాయి. ఆహారాన్ని నచ్చినవిధంగా తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బద్ధకానికి దూరంగా ఉంటే అన్నివిధాలా బాగుంటుంది. వాయిదా ధోరణికి స్వస్తి చెప్పే విధంగా ఉండాలి. చికాకు, కోపాన్ని కంట్రోల్ లో పెట్టుకుంటే మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మీ పని వరకే చూసుకోవడం మంచిది. ఔనన్నా, కాదన్నా ఎదుటివారితో, ఇంట్లో వారితోనూ ఇబ్బందిగానే ఉంటుంది. రోజు గడిచిందా లేదా అన్నట్లుగా వ్యవహరించడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడతాయి. అనవసరమైన విషయాలపై దృష్టిసారిస్తారు. అనవసరమైన, వివాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. చిన్నచిన్న గొడవలు పెద్దవవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు లాభనష్టాలుండవు. గడిచిన కాలంలో కొనుగోలు చేసిన వాటిపై దృష్టిసారిస్తారు. ఎవరన్నా మాట్లాడినా ఆసక్తి చూపించరు. విద్యార్థులకు సాధారణ ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి. శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. ఎదుటివారికి సహాయ పడటమే తప్ప, సహకరించే వర్గం తక్కువగా ఉంటుంది. ఓర్పుగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంయమనంగా ఉంటే తప్ప పనులు పూర్తికావు. బాధ్యతల బరువుని దించుకున్నామన్న తృప్తి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
Next Story