Sun Dec 22 2024 21:42:19 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 14 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిర్ణయాలు తీసుకోవడంలో సతమతమవుతారు. పని ఒత్తిడితో పూర్తవుతుంది.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బుధవారం
తిథి : బ.ఏకాదశి ఉ.8.49 వరకు
నక్షత్రం : అశ్విని మ.1.42 వరకు
వర్జ్యం : ఉ.9.41 నుండి 11.17 వరకు, రా.11.30 నుండి 1.09 వరకు
దుర్ముహూర్తం : ఉ.11.50 నుండి 12.42 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.11.00 నుండి 11.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నిరకాల సౌకర్యాలు అమరుతాయి. జన్మంలోనే రాహువు ఉండటంతో ఆందోళన పెరుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులు పెద్దగా ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. అర్థం చేసుకునేవారి సంఖ్య తగ్గుతుంది. తోటి ఉద్యోగులకు ఒడిదుడుకులు రావొచ్చు. ప్రయాణాలు అలసటకు గురిచేస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు, వివాదాలతో కూడిన రోజుగా ఉంటుంది. ఆర్థికంగా లాభం ఉంటుంది. వ్యవహారాలు ముందంజలో కొనసాగుతాయి. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిర్ణయాలు తీసుకోవడంలో సతమతమవుతారు. పని ఒత్తిడితో పూర్తవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. కాంట్రాక్ట్ రంగంవారికి మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సలహాలు పాటిస్తేనే చెప్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రిస్క్ కు దూరంగా ఉండాలి. సంబంధంలేని గొడవలు వస్తాయి. తప్పున్నా లేకున్నా అపాలజీ చెప్పాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు అధికంగా శ్రమించాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. విహారయాత్రలు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల పరంగా బాగుంటుంది. ఇష్టమైన ఆహారం స్వీకరిస్తారు. వైద్య సంప్రదింపులు మేలు చేస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.తగాదాలకు అవకాశాలు ఎక్కువ. నష్టపోయేందుకు అవకాశాలున్నాయి. ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మీ పని పూర్తైందా లేదా అన్నదే చూసుకోవడమే మంచిది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. వృథా ఖర్చులు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాల సౌకర్యాలు అమరుతాయి. స్వయంకృతాపరాధం లేనంత వరకూ పెద్దగా ఇబ్బందులుండవు. భూమికి సంబంధించిన విషయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ప్రతిమాటను ఎదుటివారు అపార్థం చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాగా అలసిపోతారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story