Sun Dec 22 2024 21:48:54 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 15 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. శ్రమ ఎక్కువ ఫలితాలు తక్కువగా ఉంటాయి. ప్రతివిషయంలో..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, గురువారం
తిథి : బ.ద్వాదశి ఉ.8.33 వరకు
నక్షత్రం : భరణి మ.2.13 వరకు
వర్జ్యం : రా.2.41 నుండి 4.21 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.06 నుండి 10.58 వరకు, మ.3.18 నుండి 4.11 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.9.00 నుండి 9.50 వరకు, సా.5.00 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారులు, ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. శ్రమఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. తగాదాలతో కూడిన అంశాల్లో పరిష్కారాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు లేత తెలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. సంఘ గౌరవానికి లోటుండదు. వ్యాపారం సజావుగా ఉంటుంది. కానీ ఆలోచనలు కార్యరూపం దాల్చవు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రావలసిన డబ్బు రాబట్టుకుంటారు. తలనొప్పి, కండరాల నొప్పులు బాధిస్తాయి. రహస్యాలను మెయింటేన్ చేయాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. శ్రమ ఎక్కువ ఫలితాలు తక్కువగా ఉంటాయి. ప్రతివిషయంలో ఎదురుదెబ్బలు తప్పవు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో చర్చలు అనుకూలిస్తాయి. ఎదుటివారికి సలహాలు, సూచనలు ఇస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి నేర్పుగా బయటపడుతారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. సంఘ గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లభిస్తాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయం కష్టంగా ఉంటుంది. తేలికగా పూర్తయ్యే పనికోసం కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా నష్టాలెక్కువగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రమేయం లేకుండానే తగాదాలుంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల వాతావరణం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న బిల్లులు వసూలు చేసుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దలతో జరిపే చర్చలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. కొట్లాటలకు దూరంగా ఉండాలి. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉన్నవారు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
Next Story