Sat Dec 21 2024 14:44:30 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 16 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. క్రయవిక్రయాలకు..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్రవారం
తిథి : బ.త్రయోదశి ఉ.8.41 వరకు
నక్షత్రం : కృత్తిక మ.3.09 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ.8.22 నుండి 9.14 వరకు, మ.12.34 నుండి 1.35 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.2.00 నుండి 2.0 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులుంటాయి. మాటతీరులో జాగ్రత్తగా ఉండాలి. ఇంట, బయట ఒత్తిడి పెరుగుతుంది. అలసిపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా ఊరటగా ఉంటుంది. కొత్తవిషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అంచనాలు తలకిందులవుతాయి. కీలక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థికంగా, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. అపార్థాలు తొలగిపోతాయి. గౌరవం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకూలం. అధికారులతో సంప్రదింపులు కలసివస్తాయి. చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక వెసులుబాటు కూడా లభిస్తుంది. ఒత్తిడులను అధిగమిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గడిచిన రెండ్రోజులకంటే అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడుతారు. నిదానంగా వ్యవహరిస్తారు. దంపతుల మధ్య తగాదాలు తప్పవు. ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. కోపం పెరుగుతుంది. అన్నీ మీకే తెలుసు అనుకోవడం ప్రమాదం. రోజంతా ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. క్రయవిక్రయాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అందంపై మమకారం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలకు అనుకూల కాలం. చిరువ్యాపారాలు, వైద్య, ఉపాధ్యాయ వృత్తుల వారికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మెరుగ్గానే ఉంటుంది కానీ.. ఆర్థిక ఇబ్బందులుంటాయి. శత్రుబలం పెరగవచ్చు. తగాదాలు, వివాదాలు తరచుగా చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడతాయి. వృథాఖర్చులుంటాయి. ఎదుటివారితో అపార్థాలుంటాయి. వ్యాపారస్తులు రొటేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాల్లో తొందరపాటు పనికిరాదు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక, శారీరక విశ్రాంతి లభిస్తుంది. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఇంట, బయట సానుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story