Sun Dec 22 2024 21:29:27 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 17 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమ పెరుగుతుంది..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శనివారం
తిథి : శు.చతుర్దశి ప.9.12 వరకు
నక్షత్రం : రోహిణి సా.4.27 వరకు
వర్జ్యం : ఉ.8.01 నుండి 9.42 వరకు, రా.10.26 నుండి 12.09 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.45 నుండి 7.29 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.50 నుండి 11.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలు, ఆర్థిక విషయాలు కలసివస్తాయి. నూతన ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అలసట పెరుగుతుంది. పనివేళలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్తవిషయాలు తెలుసుకోవాలన్న ఉబలాటం పెరుగుతుంది. చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి ప్రయత్నాలు కలసిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమ పెరుగుతుంది ఫలితాలు తక్కువగా ఉంటాయి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. రిస్క్ కు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు స్వయంకృతాపరాధాలు లేనంతవరకూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని వారికి క్లారిటీ వస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో ఊరట లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కీలక సమాచారం తెలుసుకుంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. కొండల్లా వచ్చిన కష్టాలు మబ్బుల్లా విడిపోతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ తగదు. ఏదైనా కంటితో చూడనిదే నమ్మకపోవడం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగపరంగా అనుకూలమైన కాలం. ఎదుటివారికి మీ కష్టాలను చెప్పుకుంటారు. పరిచయాలను వృద్ధి చేసుకుంటారు. ఆరోగ్యం పరంగా ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు మెరున్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. వైద్యం చురుకుగా పనిచేస్తుంది. లౌక్యంగా వ్యవహరిస్తారు. ఫీల్డ్ మారాలన్న ఆలోచనలు బలపడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదా లేకుండా రోజుపూర్తికాదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు, రహస్య శత్రువులు పెరుగుతారు. దృష్టిదోషం అధికమవుతుంది. పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. పనులు వాయిదా ధోరణిలో కొనసాగుతాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక అయోమయంగా ఉంటారు. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
Next Story