Sun Dec 22 2024 21:48:35 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 20 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత అనుకూలం. అప్పటివరకూ ఒత్తిడి విపరీతంగా..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, మంగళవారం
తిథి : శు.విదియ మ.1.09 వరకు
నక్షత్రం : పునర్వసు రా.10.37 వరకు
వర్జ్యం : ఉ.9.24 నుండి 11.10 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.23 నుండి 9.15 వరకు, రా.11.12 నుండి 11.56 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.00 నుండి 12.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకూ అనుకూలం. ముఖ్యమైన పనుల్ని సాయంత్రం లోగా పూర్తిచేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకూ పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఆర్థిక విషయాలతో పాటు ప్రతి విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం వేళ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేస్తారు. సాయంత్రం అయ్యేసరికి అన్నీ తారుమారవుతాయి.అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. నిద్రలేమి సమస్య వేధిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత అనుకూలం. అప్పటివరకూ ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అర్థం చేసుకునేవారు కొరవడుతారు. సాయంత్రం వేళ ఆలోచనల్లో మార్పు, తెలియని ఉత్సాహంతో ఉంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రిజిస్ట్రేషన్లు, జఠిల సమస్యల పరిష్కారం, ఆర్థిక సర్దుబాట్లకు అనుకూలం. సాయంత్రం 4 గంటల తర్వాత శ్రమ పెరుగుతుంది. ఫలితాలు తగ్గుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో, క్రయవిక్రయాలకు, ఆర్థికపరమైన అంశాలకు అనుకూలం. అన్నిపనులు పూర్తవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. స్నేహాలు ఉపయోగపడతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. గడిచిన కాలంలో తగిలిన గాయాలను గుర్తుచేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. సాయంత్రం 4 గంటల వరకూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు జరుగుతున్నట్టే ఉంటాయి కానీ.. పూర్తికావు. సాయంత్రం 4 గంటల లోగా కీలకమైన పనులను పూర్తి చేసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం సహకరిస్తుంది. లౌక్యంగా ఉంటారు. క్రయవిక్రయాలు కలసివస్తాయి. సంగీతంపై ఇంట్రస్ట్ పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకూ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తగాదాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇచ్చినా, తీసుకున్నా ఇబ్బందిగా ఉంటుంది. వృథా ఖర్చులు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా టైట్ గా ఉంటుంది. అయినవారే అర్థం చేసుకోకపోవడంతో బాధపడతారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
Next Story