Sun Dec 22 2024 21:58:27 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 21 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలం. శుభవార్తలు అందుకుంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బుధవారం
తిథి : శు.తదియ మ.3.11 వరకు
నక్షత్రం : పుష్యమి రా.1.21 వరకు
వర్జ్యం : ఉ.7.32 నుండి 9.18 వరకు
దుర్ముహూర్తం : ఉ.11.51 నుండి 12.44 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.50 నుండి 11.30 వరకు, సా.3.50 నుండి 4.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు అధికంగా శ్రమించాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు కలసివస్తాయి. ప్రతివిషయంలో తగాదాపడకుండా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన ఊరట లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. మాటతీరులో జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా అలసట పెరుగుతుంది. ఫైనాన్స్ రంగంలోవారు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలం. శుభవార్తలు అందుకుంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రేమలు వివాదాస్పదమవుతాయి. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. ఆర్థికంగా ఊరటగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. శ్రమ పెరుగుతుంది. మీ కష్టంతో ఎదుటివారికి ఫలితాలు అందుతాయి. సంబంధంలేని విధంగా రోజు గడుస్తుంది. వ్యాపారస్తులు, ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నిర్ణయాలు కలసివస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. క్రయవిక్రయాలకు అనుకూలం. ఉద్యోగపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహం లభిస్తుంది. కొత్తపరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థికంగా ఊరటగా ఉంటుంది. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. సౌకర్యాలను సమకూర్చుకుంటారు. దంపతుల మధ్య తగాదాలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. అవునన్నా..కాదన్నా తప్పుగానే ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. మౌనేన కలహం నాస్తి అన్నట్టు ఉండటం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రిస్క్ కు దూరంగా ఉండాలి. శ్రమ పెరుగుతుంది. అనవసరమైన వివాదాలు రావొచ్చు. జరిగే పొరపాట్లలో ప్రమేయం లేకుండానే ఇరుక్కుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆర్థిక నిర్ణయాలు కలసివస్తాయి. మాటతీరులో జాగ్రత్త వహించాలి. కొన్ని సౌకర్యాలపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్తవిషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. క్రయవిక్రయాలకు అనుకూలం. సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలం. శత్రువులపై పైచేయి మీదే అవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పట్టువిడుపుగా ఉండాలి. ఏ చిన్న తప్పు జరిగినా అందుకు బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. విద్యార్థులు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story