Sun Dec 22 2024 21:58:18 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 22 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అప్పు చేసైనా సొంతిల్లు లేదా స్థిరాస్తిని కూడబెట్టాలన్న..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, గురువారం
తిథి : శు.చవితి సా.5.28 వరకు
నక్షత్రం : ఆశ్లేష తె.3.17 వరకు
వర్జ్యం : మ.3.43 నుండి 5.30 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.07 నుండి 10.59 వరకు, మ.3.20 నుండి 4.12 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 5.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆటపాటల్లో దెబ్బలు తగులుతాయి. ప్రతి విషయంలో నిదానంగా వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. నూతన పరిచయాలు ఉపకరిస్తాయి. ఎదుటివారిని అంచనా వేస్తారు. సమస్యలను అధికారులతో చెప్పుకునేందుకు, ఫిర్యాదులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కీడెంచి, మేలెంచాలన్న చందంగా ఆలోచిస్తారు. అన్నింటా ఇలాగే ఉంటే ఇబ్బందులుంటాయి. వృథా ఖర్చులుంటాయి. శారీరక, మానసిక అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రకరకాల ఆలోచనలు చేస్తారు. పెద్దవారి సలహాలు, సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగులకు మంచి సమయం. వ్యాపారులకు రొటేషన్లు సానుకూలంగా కొనసాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. శ్రమ మీదు.. ఫలితాలు వేరొకరికి ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అప్పు చేసైనా సొంతిల్లు లేదా స్థిరాస్తిని కూడబెట్టాలన్న ఆలోచనలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతతకు ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో క్లారిటీ వస్తుంది.ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ముక్కుసూటితనంతో నష్టపోతారు. ఎదుటివారితో జరిపే సంభాషణతో కొత్త విషయాలు తెలుసుకుంటారు. రహస్యశత్రువులను కనిపెడతారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కోపాన్ని అదుపులో పెట్టుకుంటే అన్నివిధాలా అనుకూలం. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. తెలియని ఆనందంగా ఉంటారు. రోజు సంతృప్తిగా పూర్తవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతివిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చికాకు పెరుగుతుంది. తక్కువగా మాట్లాడటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బాధ, ఆవేశం, సంతోషాన్ని ఎదుటివారితో పంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. టాలెంట్ ను నిరూపించుకునేందుకు అవకాశాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. మనసుకి నచ్చినవిధంగా నడుచుకుంటారు. రోజంతా మీకు నచ్చినట్టే వ్యవహరిస్తారు. ఆర్థిక విషయాలు ఊరటనిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంట, బయట గొడవలతో కూడిన వాతావరణం ఉంటుంది. వృథా ఖర్చులుంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు రొటేషన్లు కష్టతరమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
Next Story